న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Brad Hogg డబ్ల్యూటీసీ బెస్ట్ ఎలెవన్.. భారత్ నుంచి నలుగురు.. కోహ్లీకి దక్కని చోటు!

No Virat Kohli among 4 indians in Brad Hogg picks his best XI from WTC 2019-21 cycle

న్యూఢిల్లీ: టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ కలిగించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తీసుకొచ్చిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫస్ట్ ఎడిషన్ సూపర్ సక్సెస్ అయింది. రెండు బలమైన జట్లు భారత్, న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరడం.. ఆ టైటిల్ పోరు అనేక మలుపులు తిరుగుతూ చివరకు ఫలితం తేలడం అభిమానులకు కావాల్సిన మజాను అందించింది.

అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్న కివీస్.. 8 వికెట్ల తేడాతో పటిష్ట భారత్‌ను ఓడించి తొలి టెస్ట్ టైటిల్‌ను ముద్దాడింది. అయితే గత రెండేళ్ల పాటు సాగిన ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు బెస్ట్ ఎలెవన్ ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ సైతం తన అత్యుత్తమ డబ్ల్యూటీసీ టీమ్‌ను ఎంపిక చేశాడు.

ప్చ్.. కోహ్లీకి నోచాన్స్..

ప్చ్.. కోహ్లీకి నోచాన్స్..

తన జట్టులో నలుగురు భారత ప్లేయర్లకు అవకాశం కల్పించిన బ్రాడ్ హగ్.. ఆశ్చర్యకరంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పక్కనపెట్టేసాడు. అంతేకాకుండా డబ్ల్యూటీసీ టోర్నీలో ట్రిపుల్ సెంచరీ చేసిన తమ దేశ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను కాదని శ్రీలంక ఓపెనర్ దిముత్ కరుణ రత్నేను తీసుకున్నాడు.

అతనికి తోడుగా టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను ఎంపిక చేశాడు. ఫస్ట్ డౌన్‌లో కేన్ విలియమ్సన్‌కు అవకాశం ఇచ్చిన బ్రాడ్ హగ్.. అతను తన బెస్ట్ టీమ్‌కు కెప్టెన్ అని పేర్కొన్నాడు. నాలుగో స్థానంలో కోహ్లీని కాదని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌కు చాన్స్ ఇచ్చాడు. ఇక ఆకాశ్ చోప్రా ప్రకటించిన వరల్డ్ ఎలెవన్ జట్టులో కూడా కోహ్లీకి చోటు దక్కని విషయం తెలిసిందే.

వికెట్ కీపర్‌గా పంత్..

వికెట్ కీపర్‌గా పంత్..

ఐదో స్థానంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌ను ఎంపిక చేసిన బ్రాడ్ హగ్.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను ఆరో స్థానంలో ఎంపిక చేశాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్‌గా రిషభ్ పంత్‌ను ఏడో స్థానంలో తీసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై రిషభ్ పంత్ అదరగొట్టాడని, ఫైనల్లోను కీలక సమయంలో 40 పరుగులతో రాణించాడని బ్రాడ్ హగ్ గుర్తు చేశాడు.

ఏకైక స్పిన్నర్‌గా భారత సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకున్న హగ్.. డబ్ల్యూటీసీ టోర్నీలో హయ్యెస్ట్ వికెట్ టేకర్ అతనేనని చెప్పాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన కైల్ జెమీసన్‌ను తన ప్రధాన పేసర్‌గా ఎంచుకున్న బ్రాడ్ హగ్.. స్టువర్ట్ బ్రాడ్, మహమ్మద్ షమీ‌లతో పేస్ విభాగాన్ని పూర్తి చేశాడు. ఆశ్చర్యకరంగా కగిసో రబడా, టీమ్ సౌథీ, ప్యాట్ కమిన్స్‌లను పక్కనపెట్టేసాడు.

బ్రాడ్ హగ్ డబ్ల్యూటీసీ బెస్ట్ టీమ్

బ్రాడ్ హగ్ డబ్ల్యూటీసీ బెస్ట్ టీమ్

రోహిత్ శర్మ, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, బాబర్ ఆజామ్, బెన్ స్టోక్స్, రిషభ్ పంత్, కైల్ జెమీసన్, రవిచంద్రన్ అశ్విన్, స్టువర్ట్ బ్రాడ్, మహమ్మద్ షమీ

Story first published: Wednesday, June 30, 2021, 14:57 [IST]
Other articles published on Jun 30, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X