న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'రీఎంట్రీ అవసరం లేదు.. ధోనీ ఇంకా ఏం సాధించాలి'

No need for MS Dhoni to return? Syed Kirmani opines ex-Indian skipper has achieved all his dreams and goals

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం ధోనీ రిటైర్స్ ట్యాగ్ ట్రెండ్ అవడం.. గురువారం దానికి కౌంటర్‌గా ధోనీ నెవర్ రిటైర్స్ ట్యాగ్ ట్రెండ్ చేయడంతో ధోనీ వీడ్కోలు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే మహీ మరికొన్ని రోజులు ఆడుతాడని చాలా మంది మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలవగా.. ధోనీ లాస్ట్ మ్యాచ్ ఆడేశాడని మరికొందరు అంటున్నారు. ఈ క్రమంలో ధోనీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ అభిప్రాయపడ్డాడు.

వైరల్ వీడియో.. 'మైండ్‌ బ్లాక్‌'తో అదరగొట్టిన వార్నర్‌!!వైరల్ వీడియో.. 'మైండ్‌ బ్లాక్‌'తో అదరగొట్టిన వార్నర్‌!!

ధోనీ ఇంకా ఏం సాధించాలి:

ధోనీ ఇంకా ఏం సాధించాలి:

కెరీర్‌లో ఇప్పటికే అన్ని ఘనతలు సాధించిన ఎంఎస్ ధోనీ మళ్లీ రీఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం లేదని సయ్యద్ కీర్మాణీ చెప్పుకొచ్చాడు. 'ధోనీకి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. అందుకే అతను తన భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాడు. నా అంచనా ప్రకారం అతను మళ్లీ టీమిండియాకి ఆడతాడనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికే అతను తన లక్ష్యాల్ని, కలల్ని సాకారం చేసుకున్నాడు. ఇక అతను సాధించాల్సింది ఏమీ లేదు. మీడియాలో కథనాల ప్రకారం నాకు అర్థమైంది ఒకటే.. ఐపీఎల్‌‌ 2020లో ఆడేందుకు అతడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. బహుశా ఐపీఎల్-13 సీజన్ అతనికి ఆఖరిది కావొచ్చు' అని కీర్మాణీ పేర్కొన్నాడు.

మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌:

మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌:

బంగ్లాదేశ్‌తో 2004లో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఎంఎస్ ధోనీ.. మహ్మద్ కైఫ్ కారణంగానే ఆ మ్యాచ్‌లో రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. దీంతో ధోనీ కెరీర్ ముగిసినట్లేనని అందరూ భావించారు. కానీ విశాఖ తీరాన విధ్వంసంతో (123 బంతుల్లో 15 ఫోర్లు 4 సిక్స్‌లతో 148 రన్స్) ధోనీ మైదానంలో తిరుగులేని శక్తిగా ఎదిగాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ సారథిగా నిలిచాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్‌గా భారత్‌ని విజేతగా నిలిపిన ధోనీ.. క్రికెట్ చరిత్రలో ఓ మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా రికార్డుల్లో కొనసాగుతున్నాడు.

10 నెలలుగా క్రికెట్‌కి దూరం:

10 నెలలుగా క్రికెట్‌కి దూరం:

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో సెంట్రల్ కాంట్రాక్టు నుండి అతనిని బీసీసీఐ తప్పించింది. ఇక మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. ఈ ఇద్దరిలో పంత్ ఫెయిలవగా.. రాహుల్ వన్డే, టీ20ల్లో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. ప్రస్తుతం రాహుల్ టీ20 ప్రపంచకప్ రేసులో ఉన్నాడు.

డైలమాలో ధోనీ క్రికెట్ భవిష్యత్తు:

డైలమాలో ధోనీ క్రికెట్ భవిష్యత్తు:

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. ఐపీఎల్‌లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. లీగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కచ్చితంగా చెప్పలేం. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.

Story first published: Saturday, May 30, 2020, 14:25 [IST]
Other articles published on May 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X