న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని భార్య సాక్షికి ఎంత కష్టమొచ్చిందో తెలుసా!

No Electricity For 5 Hours: Sakshi Dhoni Tweets About Ranchi Power Cuts

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ ధోని భార్య సాక్షి జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉన్న విద్యుత్‌ కోతల గురించి తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం రాంచీలో విద్యుత్ కోతలు విపరీతంగా ఉన్నాయని... ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సాక్షి ట్విట్టర్‌లో రాసుకొచ్చింది.

<strong>హస్సీకి ఊహించని ప్రశ్న: ధోని-పాంటింగ్‌లలో ఎవరు గొప్ప కెప్టెన్?</strong>హస్సీకి ఊహించని ప్రశ్న: ధోని-పాంటింగ్‌లలో ఎవరు గొప్ప కెప్టెన్?

ట్విట్టర్‌లో సాక్షి

ట్విట్టర్‌లో సాక్షి

సాక్షి తన ట్విట్టర్‌లో "రాంచీలో ప్రజలు రోజూ విద్యుత్‌ కోతలను అనుభవాన్ని చవిచూస్తున్నారు. రోజూ దాదాపు 4 నుంచి 7 గంటలు విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. ఈ రోజు అంటే 2019 సెప్టెంబర్‌ 19న 5 గంటలకు పైగా విద్యుత్‌ లేదు. వాతావరణం బాగుంది. పండగలు కూడా ఏమీ లేవు. ఇలాంటి సమయంలో కోత విధించడంలో అర్థమేమీ లేదు. సంబంధిత వర్గాలు సమస్యను పరిష్కరిస్తాయని అనుకుంటున్నా" అని రాసుకొచ్చారు.

నెటిజన్లు స్పందన

నెటిజన్లు స్పందన

సాక్షి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. విద్యుత్‌ లేకపోవడంతో రోజూ తాము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని ఆమె ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. 'ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ దీనిపై ఆలోచించండి' అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. 'ఈ సమస్య ఒక్క రాంచీలోనే కాదు రాష్ట్రం అంతటా ఉంది' అని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు.

ఫారీలతో జరుగుతున్న టీ20

ఫారీలతో జరుగుతున్న టీ20

ఇదిలా ఉంటే, స్వదేశంలో సఫారీలతో జరుగుతున్న టీ20 సిరిస్ నుంచి ధోని తనంతట తానుగా తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ధోని కుటుంబ సభ్యులతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా టీమిండియా ఆదివారం మూడో టీ20లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం

టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం

ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.... మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Story first published: Saturday, September 21, 2019, 11:14 [IST]
Other articles published on Sep 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X