న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దేశీవాలీ ట్రోఫీకి దూరమైన ధోనీ..??

MS Dhoni Is Not Playing In Vijay Hazare Trophy For Hazare Trophy
No domestic service for Mahendra Singh Dhoni

న్యూఢిల్లీ: క్రికెటర్‌గా ధోనీ గొప్పదనం గురించి అందరికీ తెలిసిందే. మైదానంలో బరిలో దిగితే చాలు.. తన వ్యూహాలతో ఆటను మలుపు తిప్పగలిగే దిట్ట అతడు. అందుకే ధోనీతో కలిసి ఆడాలని చాలా మంది ఆటగాళ్లు కలగంటారు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకావం కొద్ది మందికే లభిస్తుంది. కాబట్టి ధోనీతో కలిసి దేశవాళీ క్రికెట్లోనైనా ఆడాలని జార్ఖండ్ క్రికెటర్లు ఉబలాటపడతారు.

ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్ గెలిపించిన అర్జున్ టెండూల్కర్ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్ గెలిపించిన అర్జున్ టెండూల్కర్

 ధోనీ సొంత రాష్ట్రం తరఫున బరిలో దిగడం లేదు

ధోనీ సొంత రాష్ట్రం తరఫున బరిలో దిగడం లేదు

కానీ, ధోనీ ఈసారి విజయ్ హజారే ట్రోఫీలో సొంత రాష్ట్రం తరఫున బరిలో దిగడం లేదు. గతేడాది జార్ఖండ్ తరఫున ఆరు మ్యాచ్‌ల్లోనూ మహీ ఆడాడు. విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ దశలోనైనా మహీ జార్ఖండ్ తరఫున ఆడతాడని భావించారు. పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్న ధోనీ ఆసియా కప్ తర్వాత జార్ఖండ్ జట్టు తరఫున బరిలో దిగుతాడని ఫ్యాన్స్ భావించారు.

ధోనీ.. దిశానిర్దేశం చేస్తున్నాడని

ధోనీ.. దిశానిర్దేశం చేస్తున్నాడని

అప్పట్లో ‘జట్టుతోపాటు ధోనీ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మెంటార్‌ పాత్ర పోషిస్తున్న ధోనీ.. ఇతర ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తున్నాడ'ని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. కానీ, వెస్టిండీస్‌తో తలపడుతున్న టీమిండియా టెస్టు సిరీస్ ముగించుకుని వన్డే మ్యాచ్‌లను అక్టోబరు 21 నుంచి ఆడనుంది. బహుశా ఈ జట్టులో ఒకడిగా ధోనీ ఉంటే విజయ్ హజారే ట్రోఫీ ఆడకపోవడానికి అదే కారణం అని చెప్పుకోవచ్చు.

124బంతులు ఆడిన ధోనీ.. 77పరుగులు

124బంతులు ఆడిన ధోనీ.. 77పరుగులు

ఇంగ్లాండ్.. ఆసియా కప్‌లలో వన్డే ఫార్మాట్‌లో ఆడిన ధోనీ బ్యాట్స్‌మన్‌గా మళ్లీ ఫెయిలైయ్యాడు. ఆసియా కప్‌లో 124బంతులు ఆడిన ధోనీ.. 77పరుగులు చేశాడు. వీటిలో ఒక్క సిక్సు బౌండరీ కూడా కనిపించకపోవడం గమనార్హం. ఫైనల్ మ్యాచ్‌లోనూ ధోనీ 83-3వద్ద బ్యాటింగ్‌కు దిగిన ధోనీ.. 67బంతులాడి 36పరుగులతో ముగించాడు.

 ధోనీ దేశీవాలీ క్రికెట్‌లో ఆడటమే మంచిది

ధోనీ దేశీవాలీ క్రికెట్‌లో ఆడటమే మంచిది

అప్పటికీ భారత్ విజయానికి 63పరుగుల దూరంలో 160-5వద్ద ఉంది. ధోనీని మంచి ఫినిషర్‌గానే ఊహించుకునే అభిమానులు ఆ టోర్నమెంట్‌లో అతని ప్రదర్శన చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే 'ధోనీ దేశీవాలీ క్రికెట్‌లో ఆడటమే మంచిది. బంతిని మరింత సేపు ఎదుర్కొనేందుకు పరిమిత ఓవర్ల ఫార్మాట్ అయితేనే సరిగ్గా నప్పుతుంది' అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.

Story first published: Monday, October 8, 2018, 16:13 [IST]
Other articles published on Oct 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X