న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని నువ్వు సీఎస్‌కేకే ఆడతావా? ఇండియాకి ఆడవా?

No cricketer served country better than MS Dhoni, says Kapil Dev

హైదరాబాద్: ధోనీ కన్నా ఈ దేశానికి ఏ క్రికెటర్ కూడా ఎక్కువ సేవ చేయలేదని మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా గత ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆఖరి బంతికి లైన్ మిస్ కావడంతో ఒక పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధోని విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు. 48 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఆఖరి ఓవర్‌లో 26 పరుగులు అవసరమైన దశలో

ఆఖరి ఓవర్‌లో 26 పరుగులు అవసరమైన దశలో

సీఎస్‌కే విజయానికి ఆఖరి ఓవర్‌లో 26 పరుగులు అవసరమైన దశలో... ఆర్సీబీ బౌలర్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో తొలి ఐదు బంతుల్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో కలుపుకుని మొత్తంగా 24 పరుగులు సాధించాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా... శార్దూల్ ఠాకూర్ రనౌటయ్యాడు. దీంతో మ్యాచ్ సీఎస్‌కే నుంచి చేజారింది. ఈ క్రమంలో సీఎస్‌కే మ్యాచ్ అయితే చాలు... ధోని విజృంభిస్తాడని... భారత జట్టులో ఎప్పుడైనా ఇలాంటి ఆడాడా? టీమిండియాలో కూడా సీఎస్‌కే జెర్సీ వేసుకుని ధోని ఆడాలంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు.

ధోని తరహా క్రికెట్‌ ఆడే క్రికెటర్‌

ధోని తరహా క్రికెట్‌ ఆడే క్రికెటర్‌

ఈ కామెంట్లపై ధోని తరహా క్రికెట్‌ ఆడే క్రికెటర్‌ భారతదేశంలోనే ఎవరూ లేడంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. కపిల్ మాట్లాడుతూ "ధోని గురించి మాట్లాడటానికి ఏమి లేదు. దేశంలోని ప్రతి ఒక్కరినుంచి గౌరవం పొందేందుకు ధోని అర్హుడు. నా దృష్టిలో దేశం కోసం ఎక్కువ సేవ చేస్తున్న క్రికెటర్‌ ఎవరైనా ఉన్నారంటే అది ధోనినే" అని అన్నాడు.

ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడమంటే

ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడమంటే

"సుదీర్ఘకాలంగా జట్టుకు ఆడుతూ... మరొకవైపు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడమంటే అంత సులభం కాదు. ధోని తరహాలో అటు గేమ్‌పై ఇటు ఫిట్‌నెస్‌పై దృష్టి నిలపాలంటే ఎవరికైనా భారంగానే ఉంటుంది. ధోని కంటే ఎక్కువగా దేశం కోసం సేవ చేసిన క్రికెటర్‌ ఎవరైనా ఉన్నారంటే నా దృష్టిలో ఎవరూ లేరనే చెప్పాలి" అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.

ధోని ఆటగాడికి గౌరవం ఇవ్వడం తప్ప

ధోని ఆటగాడికి గౌరవం ఇవ్వడం తప్ప

"అలాంటి ఆటగాడికి గౌరవం ఇవ్వడం తప్ప మనం చేయాల్సింది ఏమీ లేదు. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ధోని కీలక పాత్ర పోషిస్తాడు" అని కపిల్‌ దేవ్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం కోహ్లీసేన బాగున్నప్పటికీ వరల్డ్‌కప్ నెగ్గడం అంత సులభం కాదని అన్నాడు. ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది.

తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా

తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా

లండన్‌లోని ఐకానిక్ ది ఓవల్ స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన పద్దతిలో జరిగే ఈ వరల్డ్‌కప్‌లో ఒక్కో జట్టు టోర్నీలోని మిగతా జట్లతో తలపడనుంది. వన్డే వరల్డ్‌కప్‌కు యునైటెడ్ కింగ్‌డమ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి.

46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు

46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు

యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మెగా టోర్నీలో కోహ్లీసేన జూన్ 5న దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్‌ ఆడనుందిట్టు. టోర్నీకే హై ఓల్టేజ్ మ్యాచ్‌గా నిలవనున్న భారత్-పాక్ మ్యాచ్ జూన్ 16న జరగనుంది.

Story first published: Tuesday, April 23, 2019, 18:43 [IST]
Other articles published on Apr 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X