న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్థాన్‌తో టెస్టు సిరిస్: న్యూజిలాండ్‌ జట్టులో భారత స్పిన్నర్

By Nageshwara Rao
New Zealand pick India-born spinner Ajaz Patel in Test squad against Pakistan

హైదరాబాద్: భారత సంతతికి చెందిన స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ న్యూజిలాండ్‌ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. అక్టోబర్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ సెలక్టర్లు బుధవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టుని ప్రకటించారు.

ఈ జట్టులో స్పిన్నర్ అజాజ్‌కు చోటు దక్కించుకున్నాడు. ముంబైలో పుట్టిన అజాజ్‌.. చిన్నతనంలోనే న్యూజిలాండ్‌కు వెళ్లాడు. 29 ఏళ్ల అజాజ్‌ పటేల్‌ న్యూజిలాండ్ దేశవాళీ టోర్నీ ఫ్లంకెట్ షీల్డ్‌లో 48 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.

దేశవాళీ క్రికెట్‌లో వరుసగా మూడు సంవత్సరాల పాటు అద్భుత ప్రదర్శన చేసిన అజాజ్‌ 2017 సంవత్సరానికి గాను డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ సెలక్టర్లు అజాజ్‌కు టెస్టు క్రికెట్ ఆడే అవకాశం దక్కింది.

మరోవైపు, మిచెల్‌ సాంట్నర్‌ గాయపడటంతో అతని స్థానంలో అజాజ్‌ను తీసుకున్నట్లు చీఫ్‌ సెలక్టర్‌ గావిన్‌ లార్సెన్‌ తెలిపారు. సాంట్నర్‌ స్థానంలో అజాజ్‌ సరైనవాడని ఆయన తెలిపారు. జట్టులోకి అజాజ్‌తో పాటు టామ్‌ బ్లండేల్‌, బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌గా బీజే వాట్లింగ్‌ చోటు దక్కించుకున్నారు.

పాక్‌తో మూడు టెస్టులకు కివీస్ జట్టు:
Kane Williamson (captain), Todd Astle, Tom Blundell, Trent Boult, Colin de Grandhomme, Matt Henry, Tom Latham, Henry Nicholls, Ajaz Patel, Jeet Raval, Ish Sodhi, Tim Southee, Ross Taylor, Neil Wagner, BJ Watling.

Story first published: Wednesday, July 25, 2018, 12:14 [IST]
Other articles published on Jul 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X