న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శస్త్ర చికిత్స: బోవెల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న దిగ్గజ క్రికెటర్

By Nageshwara Rao
New Zealand great Richard Hadlee diagnosed with bowel cancer

హైదరాబాద్: న్యూజిలాండ్ లెజెండరీ క్రికెటర్ రిచర్డ్ హాడ్లీ తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. 66 ఏళ్ల రిచర్డ్ హాడ్లీ గత కొంతకాలంగా బోవెల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దీంతో ఆయనకి ఇటీవలే శస్త్ర చికిత్స చికిత్స జరిగింది. ఈ విషయాన్ని ఆయన భార్య డెన్నీ హాడ్లీ తెలిపారు.

''గత మూడేళ్లుగా రిచర్డ్‌కి కొలొనొస్కోపి జరుగుతుంది. అయితే గత నెలలో అతనికి బొవెల్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించాం. అతనికి ఆపరేషన్‌ చేసి ట్యూమర్‌ని తొలగించారు. ఆపరేషన్ సజావుగా జరిగింది. అతని త్వరలోనే మెరుగుపడుతుంది'' అని ఆమె తెలిపారు.

జూలై 3, 1951లో జన్మించిన రిచర్డ్ హాడ్లీ ప్రపంచంలోని అత్యుత్తమ దిగ్గజ క్రికెటర్లలో ఒకరు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్ చరిత్రలో 400 వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్ రిచర్డ్‌ హాడ్లీనే. 1990లో రిటైరైన రిచర్డ్ తన కెరీర్‌లో 86 టెస్టులు ఆడి 22.29 ఎకానమీతో 431 వికెట్లు తీశారు.

ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రిచర్డ్ 9 వికెట్లు తీసి 52 పరుగులిచ్చారు. ఇది రిచర్డ్ హాడ్లీ కెరీర్‌లోనే అత్యుత్తమం. అంతేకాదు, రిచర్డ్ మంచి బ్యాట్స్‌మెన్ కూడా. తన టెస్టు కెరీర్‌లో 3,124 పరుగులు చేశారు. ఇందులో 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాక హాడ్లీ కివీస్ తరఫున వన్డేలు కూడా ఆడారు.

మొత్తం 115 వన్డేలాడిన రిచర్డ్ హాడ్లీ 158 వికెట్లు తీయగా, బ్యాటింగ్‌లో 1,751 పరుగలు చేశారు. వన్డేల్లో హాడ్లీ అత్యధిక స్కోర్ 79.

Story first published: Wednesday, June 13, 2018, 19:02 [IST]
Other articles published on Jun 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X