న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాతో వన్డే సిరీస్‌.. తొలి వన్డేకు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్!!

New Zealand Captain Kane Williamson ruled out of first two ODIs against India

హామిల్టన్: టీ20 సిరీస్ అనంతరం న్యూజిలాండ్‌-భారత్ జట్లు మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమవుతున్నాయి. వన్డే సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 5న హామిల్టన్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. అయితే తొలి వన్డేకు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. వన్డే సిరీస్‌లోని తొలి రెండు వన్డేలకు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ దూరంగా ఉండనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్‌కు విలియమ్‌సన్ దూరమవడం పెద్ద ఎదురుదెబ్బే.

<strong>టీమిండియాతో సెమీఫైనల్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్!!</strong>టీమిండియాతో సెమీఫైనల్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్!!

విలియమ్‌సన్ ఔట్

విలియమ్‌సన్ ఔట్

మొదటి రెండు వన్డేలకు విలియమ్‌సన్ బదులుగా కివీస్ జట్టు కెప్టెన్‌గా టామ్ లాథమ్ వ్యవహరిస్తాడని న్యూజిలాండ్ బోర్డు స్పష్టం చేసింది. ఇక విలియమ్‌సన్ స్థానంలో మార్క్ చాప్‌మెన్ భర్తీ చేయనున్నాడు. టీమిండియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో విలియమ్‌సన్ గాయపడ్డాడు. ఆపై జరిగిన రెండు టీ20లకు అతడు దూరమయ్యాడు. దీంతో మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్ దూరమవడంతో కివీస్ మిగతా రెండు మ్యాచులు కూడా ఓడిపోయింది.

విలియమ్‌సన్‌కు విశ్రాంతి:

విలియమ్‌సన్‌కు విశ్రాంతి:

తాజాగా విలియమ్‌సన్ ఎక్స్-రే రిపోర్ట్‌ను పరిశీలించిన కివీస్ జట్టు వైద్యులు కంగారు పడాల్సింది ఏమీ లేదని తేల్చారు. అయితే గాయం నుంచి విలియమ్‌సన్ త్వరగా కోలుకోవాలంటే కొద్దిరోజులు క్రికెట్ ఆడకుండా విశ్రాంతి తీసుకుంటే మంచిదని సూచించారు. ఈక్రమంలోనే తొలి రెండు వన్డేలకు కెప్టెన్ దూరంగా ఉన్నాడు.

రోహిత్‌ శర్మకు గాయం

రోహిత్‌ శర్మకు గాయం

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కూడా గాయం కారణంగా కివీస్‌తో జరగనున్న వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరం అయిన విషయం తెలిసిందే. ఐదవ టీ20లో శ్రేయాస్ అయ్యర్ షాట్ కొట్టగా.. సింగల్ తీసే క్రమంలో రోహిత్ పిక్క కండరాలు పట్టేశాయి. మొదటగా ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స చేశాడు. అనంతరం ఓ భారీ సిక్స్ బాదినా.. ఆ తర్వాత బంతికి రోహిత్ బాగా ఇబ్బంది పడ్డాడు. దీంతో మైదానం వీడాడు. ఫీల్డింగ్‌ సమయంలో కూడా మైదానంలోకి దిగలేదు.

జట్టు ఫలితంపై ప్రభావం

జట్టు ఫలితంపై ప్రభావం

ఐదు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన జోష్‌లో ఉన్న భారత జట్టు వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. మరోవైపు వన్డే సిరీస్ అయినా గెలుచుకోవాలని కివీస్ చూస్తోంది. ఈ నేపథ్యంలో సూపర్‌ ఫామ్‌లో ఉన్న హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ దూరం కావడం భారత జట్టు ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు కివీస్ పరిస్థితి ఇలానే ఉంది.

Story first published: Tuesday, February 4, 2020, 13:40 [IST]
Other articles published on Feb 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X