న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌తో తొలి టెస్ట్.. న్యూజిలాండ్ జట్టులో చిన్న మార్పు.!

New Zealand call up Matt Henry as cover for Neil Wagner ahead of 1st Test vs India

వెల్లింగ్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు ఆతిథ్య న్యూజిలాండ్ 13 మంది సభ్యులతో కూడి జట్టును ప్రకటించింది. గాయంతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరమైన ట్రెంట్ బౌల్ట్ రీ ఎంట్రీ ఇస్తున్నాడని స్పష్టం చేసింది. అయితే ఆ జట్టు మ్యాచ్‌కు ముందు చిన్న మార్పు చేసింది. పేస్ బౌలర్ నెయిల్ వాగ్నర్ స్థానంలో మాట్ హెన్రీని ఎంపిక చేసింది.

బిడ్డ కోసం..

బిడ్డ కోసం..

వాగ్నర్ భార్య త్వరలోనే ఓ బిడ్డకి జన్మిన్వబోతుండటంతో ప్రసవ సమయంలో ఆమె దగ్గర ఉండాలని తొలి టెస్టు నుంచి అతను తప్పుకున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి భారత్‌తో టెస్టు సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో మాట్ హెన్రీకి చోటు దక్కాల్సింది. కానీ.. ఇటీవల భారత్‌పై వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కైల్ జెమీషమ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దీంతో సెలెక్టర్లు అతనికి సంప్రదాయక ఫార్మాట్‌లో అవకాశం కల్పించారు. ఈ కారణంగా హెన్రీ అవకాశం చేజారగా.. వాగ్నర్ రూపంలో మరో అవకాశం దక్కింది.

ఆస్ట్రేలియాతో హెన్రీ ఫ్లాఫ్ షో..

ఆస్ట్రేలియాతో హెన్రీ ఫ్లాఫ్ షో..

ఇటీవల ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా టెస్టు మ్యాచ్ ఆడిన హెన్రీ.. పేలవ ప్రదర్శన కనబర్చాడు. ఆ మ్యాచ్‌లో హెన్రీ రెండు వికెట్లు మాత్రమే పడగొట్టగా.. ఆ సిరీస్‌లో కివీస్ క్లీన్‌స్వీప్‌‌కు గురైంది. కానీ.. భారత్‌పై మాట్ హెన్రీకి మెరుగైన రికార్డ్ ఉంది. గత ఏడాది భారత్‌తో ముగిసిన వరల్డ్‌కప్ సెమీస్‌ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన హెన్రీ.. కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇరుజట్లు తొలి టెస్టుకు సిద్ధమయ్యాయి. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌తో కైల్ జెమీషమ్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

కోహ్లీకి బౌల్ట్ సవాల్..

కోహ్లీకి బౌల్ట్ సవాల్..

గాయం కారణంగా ఆరు వారాలు క్రికెట్‌కు దూరమైన కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్.. ఈ మ్యాచ్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అలా సెలెక్ట్ అయ్యాడో లేదో అప్పుడే విరాట్ కోహ్లీని ఔట్ చేస్తానని మీడియా ముఖంగా సవాల్ విసిరాడు. నెంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి వికెట్‌ తీస్తేనే అసలైన మజా ఉంటుందన్నాడు. ‘కోహ్లి అసాధారణ బ్యాట్స్‌మన్‌. తన గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అతనెంతటి గొప్ప ఆటగాడో అందరికీ తెలుసు. అలాంటి మేటి బ్యాట్స్‌మన్‌‌ను ఔట్‌ చేయడం ద్వారా నా సత్తాను నేనే పరీక్షించుకుంటా. అందుకే మ్యాచ్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను' అని తెలిపాడు.

న్యూజిలాండ్ జట్టు:

న్యూజిలాండ్ జట్టు:

కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ లాథమ్, టామ్ బ్లండెల్, రాస్ టేలర్, హెన్రీ నికోలస్, బీజే వాట్లింగ్, కొలిని డి గ్రాండ్ హోమ్, టీమ్ సౌథీ, మాట్ హెన్రీ , ట్రెంట్ బౌల్ట్, ఆజాజ్ పటేల్, జిమ్‌సన్, డార్లీ మిచెల్

Story first published: Wednesday, February 19, 2020, 17:14 [IST]
Other articles published on Feb 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X