న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనిని తక్కువగా అంచనా వేయొద్దు: అభిమాని ట్వీట్‌కు క్లార్క్ రిప్లై

India Vs AUstralia 2019: Never Underestimate Importance Of Dhoni, Says Michael Clarke
Never underestimate importance of Dhoni, says Michael Clarke

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని తక్కువ అంచనా వేసిన ఓ అభిమానికి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ గట్టిగానే సమాధానమిచ్చాడు. ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల వేదికగా బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 35 పరుగుల తేడాతో ఓడిపోవడంతో 3-2తో సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే.

<strong>8000 ODI runs:ఢిల్లీ వన్డేలో రోహిత్ శర్మ ఖాతాలో మరో మైలురాయి</strong>8000 ODI runs:ఢిల్లీ వన్డేలో రోహిత్ శర్మ ఖాతాలో మరో మైలురాయి

వరల్డ్‌కప్ ముంగిట యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని పరీక్షించడం కోసం చివరి రెండు వన్డేల నుంచి ధోనికి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఐదు వన్డేల సిరిస్‌లో తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన కోహ్లీసేన ఆ తర్వాతి మూడు వన్డేల్లో వరుసగా ఓడిపోయింది. దీంతో భారత్ ఓటమికి ధోని లేకపోవడం కాడా ఓ కారణమని వార్తలు వచ్చాయి.

అయితే, ఓ అభిమాని మాత్రం యువరాజ్ సింగ్‌ లాంటి బ్యాట్స్‌మెన్ మిడిలార్డర్‌లో లేకపోవడమే టీమిండియా ఓటమికి కారణమని క్లార్క్‌కి ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశాడు. 2011 ప్రపంచకప్‌లో ధోనీతో కలిసి మిడిలార్డర్‌‌లో నిలకడగా రాణించిన యువీ లాంటి బ్యాట్స్‌మెన్‌ను భారత్ జట్టు భర్తీ చేసుకోలేకపోతోంది. ఆస్ట్రేలియా జట్టు మిడిలార్డర్‌లో హ్యాండ్స్‌కోంబ్, ఆస్టన్ టర్నర్‌లతో సమతూకంగా కనిపిస్తోంది. ఒకరు స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే.. మరొకరు దూకుడుగా ఆడుతున్నారు" అని అభిమాని ట్వీట్ చేశాడు.

ఆ అభిమాని ట్వీట్‌కు క్లార్క్ స్పందిస్తూ "ధోనీని తక్కువ అంచనా వేయొద్దు. జట్టు మిడిలార్డర్‌లో అనుభవం (అనుభవజ్ఞుడులు) చాలా కీలకం" అని సమాధానమిచ్చాడు.

Story first published: Thursday, March 14, 2019, 17:51 [IST]
Other articles published on Mar 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X