న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని వికెట్ల వెనుక ఉంటే... క్రీజు వదలొద్దు: క్రికెటర్లకు ఐసీసీ సలహా

Indis vs New Zealand : ICC Compliments On Dhoni's Run-Out In 5th Odi | Oneindia Telugu
Never leave your crease with MS Dhoni behind the stumps: ICC advises cricketers

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనుక ఉంటే... క్రీజు వదిలి వెళ్లొద్దని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) బ్యాట్స్‌మెన్‌కు సలహా ఇచ్చింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ జేమ్స్ నీషమ్‌ను ధోని తెలివిగా రనౌట్‌ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఐసీసీ బ్యాట్స్‌మెన్‌ను హెచ్చిరించింది. 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 36.1 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఈ దశలో క్రీజులోని బ్యాట్స్‌మెన్ జేమ్స్ నీషమ్ (44: 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) వరుస బౌండరీలతో దూకుడుగా ఆడుతున్నాడు. దీంతో కేదార్ జాదవ్‌‌ని బౌలింగ్‌కి పిలిపించిన ధోని, తెలివిగా నీషమ్‌ని ఔట్ చేసి మళ్లీ రేసులోకి మళ్లీ భారత్‌ను తీసుకొచ్చాడు.

5th ODI: ధోని త్రోని ఊహించలేకపోయాడు.. నీషమ్ రనౌట్ అయ్యాడిలా! (వీడియో)5th ODI: ధోని త్రోని ఊహించలేకపోయాడు.. నీషమ్ రనౌట్ అయ్యాడిలా! (వీడియో)

ఇన్నింగ్స్ 37వ ఓవర్

ఇన్నింగ్స్ 37వ ఓవర్

ఇన్నింగ్స్ 37వ ఓవర్ వేసిన కేదార్ జాదవ్ బౌలింగ్‌లో బంతిని స్వీప్ చేసేందుకు నీషమ్ ప్రయత్నించాడు. అయితే, అతడి శరీరాన్ని తాకిన బంతి ధోని పక్క నుంచి వికెట్లకి దూరంగా వెళ్లింది. బంతి ఎక్కడికి వెళ్లిందోనని తెలుసుకునేందుకు కొన్ని క్షణాల సమయం తీసుకున్నాడు. అదే సమయంలో వికెట్ల వెనుకన ఉన్న బంతిని చూసి పరుగు కోసం సాహసోపేతంగా క్రీజు వెలుపలికి వెళ్లాడు.

ధోని రెప్పపాటులో

అయితే.. అప్పటికే బంతిని అందుకున్న ధోని రెప్పపాటులో దానిని వికెట్లపైకి విసిరాడు. ధోని త్రోని ఊహించలేకపోయిన నీషమ్ పేలవంగా రనౌటై నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ఇది ఆతిథ్య జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. ఇలా వికెట్ల వెనుక చాకచక్యంగా వ్యవహరించిన ధోనిపై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

ధోని వెనుకాల ఉంటే

ధోని వెనుకాల ఉంటే బ్యాట్స్‌మెన్‌ క్రీజ్‌ వీడడమా? అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని ధోని విషయంలో బ్యాట్స్‌మెన్‌కు సలహా ఇవ్వండని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)ని కోరాడు. దీనికి ఐసీసీ తన ట్విట్టర్‌లో 'స్టంప్స్‌ వెనుక ధోని ఉన్నాడంటే ఎప్పుడూ క్రీజ్‌ను వీడొద్దు' అని ట్వీట్ చేసింది.

రనౌట్ అయిన జేమ్స్ నీషమ్‌

మరోవైపు రనౌట్ అయిన న్యూజిలాండ్ క్రికెటర్ జేమ్స్ నీషమ్‌ నిందిస్తూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్‌ చేశారు. దీంతో అభిమానులకు నీషమ్‌ వివరణ ఇచ్చుకున్నాడు. ‘సలహాలిచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను బంతినే చూశాను. కెమెరాలు నా ఐబాల్‌ను కూడా క్యాచ్‌ చేశాయి' అని ట్వీట్ చేశాడు.

1
44084
Story first published: Monday, February 4, 2019, 12:27 [IST]
Other articles published on Feb 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X