న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్‌ రికార్డులకు చేరువగా ఎవరూ వస్తారనుకోలేదు.. కోహ్లీపై కపిల్‌దేవ్‌ ప్రశంసలు

Never Expected Somebody Could Come Close To Sachin Tendulkar says Kapil Dev

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ ప్రశంసలు కురిపించాడు. భారత దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌ రికార్డులకు ఏ ఒక్క క్రికెటర్‌ చేరువగా వస్తాడని ఏనాడు ఊహించలేదని, కానీ కోహ్లీ చేరువగా వచ్చాడు అని కపిల్‌దేవ్‌ పేర్కొన్నాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి దివంగత బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ పేరు పెట్టారు. ఢిల్లీ ప్రాంతంలో క్రికెట్‌కు ప్రాచుర్యం తీసుకురావడం కోసం జైట్లీ చేసిన సేవలను గౌరవిస్తూ ఈ స్టేడియం పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.

<strong>కోహ్లీ భావోద్వేగం: అప్పట్లో ఈ స్టేడియంలో శ్రీనాథ్‌ ఆటోగ్రాఫ్‌ అడిగా.. ఇప్పుడు నా పేరుతో పెవిలియన్‌</strong>కోహ్లీ భావోద్వేగం: అప్పట్లో ఈ స్టేడియంలో శ్రీనాథ్‌ ఆటోగ్రాఫ్‌ అడిగా.. ఇప్పుడు నా పేరుతో పెవిలియన్‌

కోహ్లీ పెవిలియన్‌:

కోహ్లీ పెవిలియన్‌:

అలాగే స్టేడియంలోని ఒక స్టాండ్‌కు విరాట్‌ కోహ్లీ పెవిలియన్‌ అని పేరు పెట్టారు. ఈ రెండు కార్యక్రమాలు గురువారం నెహ్రూ స్టేడియంలోని వెయిట్‌లిఫ్టింగ్‌ హాల్‌లో జరిగాయి. దీనికి భారత హోంశాఖ మంత్రి అమిత్‌ షా, క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మ, కోచ్ రవి శాస్త్రి సహా పలువురు ఆటగాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విరాట్ కోహ్లీ క్రికెట్‌ ప్రయాణానికి సంబంధించిన ఓ వీడియోను ప్రదర్శించారు.

ఆటను వేరే స్థాయికి తీసుకెళ్లిపోయాడు:

ఆటను వేరే స్థాయికి తీసుకెళ్లిపోయాడు:

కపిల్‌దేవ్‌ మాట్లాడుతూ... 'కోహ్లీకి ఇంకా చాలా కెరీర్‌ ఉంది. అతని కెరీర్‌ మధ్యలో ఉండగా ఎన్ని రికార్డులు బద్ధలు కొడతాడనే దానిపై మాట్లాడటం సరైనది కాదు. సచిన్‌ తన శకంలో రికార్డులు మోత మోగించాడు. అదొక అద్భుతం. సచిన్‌ రికార్డులకు చేరువగా ఎవరూ వస్తారని అనుకోలేదు. ఇప్పుడు సచిన్‌ అత్యధిక సెంచరీల రికార్డుకు విరాట్ చేరువగా వచ్చాడు. అయితే ఆటను కోహ్లీ వేరే స్థాయికి తీసుకెళ్లిపోయాడు' అని అన్నారు.

అపారమైన జ్ఞానం కోహ్లీ సొంతం:

అపారమైన జ్ఞానం కోహ్లీ సొంతం:

'కోహ్లీ పరుగుల వరద సృష్టించడం టీమిండియాకు శుభపరిణామం. కోహ్లీ ఆటను చూసి నేను చాలా సంతోష పడుతున్నా. క్రికెట్‌లో అపారమైన జ్ఞానం అతని సొంతం. అలాంటి ఆటగాడిని టీమిండియాకు ఇచ్చినందుకు ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌కు థ్యాంక్స్‌ చెప్పాలి. కోహ్లీ ఇలాగే పరుగులు చేయాలని, టీమిండియాకు మరింత పేరును తేవాలని కోరుకుంటున్నా' అని కపిల్‌దేవ్‌ పేర్కొన్నాడు.

ఏం చేసినా తక్కువే:

ఏం చేసినా తక్కువే:

'ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌కు జైట్లీ అధ్యక్షుడిగా ఎంతో సేవ చేశారు. మనం ఏం చేసినా.. అతనికి సరిపోదు అని నేను అనుకుంటున్నా. క్రికెట్ కోసం చాలా చేసారు. వ్యక్తిగతంగా నేను దాని గురించి చాలా సంతోషంగా ఉన్నా. జైట్లీకి క్రికెట్ ఆటపై ఎంతో జ్ఞానం ఉంది' అని కపిల్‌దేవ్‌ చెప్పుకొచ్చారు.

Story first published: Friday, September 13, 2019, 11:19 [IST]
Other articles published on Sep 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X