న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అర్జున్‌ను ఆడించకపోవడంతో ముంబైపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు.. ట్విట్టర్లో ట్రోల్స్

Netizens condemn Mumbai Indians Franchise attitude towards Arjun Tendulkar

అర్జున్ టెండూల్కర్‌‌కు ముంబై ఇండియన్స్ టీం మళ్లీ మొండిచేయి చూపింది. వరుసగా రెండు సీజన్ల పాటు ముంబై తరఫున అర్జున్ టెండూల్కర్ ఆడుతున్నప్పటికీ.. తుది జట్టులో మాత్రం రెండు సీజన్లలో అతనికి చోటు దక్కలేదు. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేయాలనే అతని ఆశలు అడియాసలు అయ్యాయి. ముంబై మెంటార్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు కావడమే అతను చేసిన పాపమా అంటూ నెటిజన్లు సైతం ముంబై ఇండియన్స్ పై ఫైర్ అవుతున్నారు. అతనికి అవకాశమిస్తేనా కాదా.. అతను ఐపీఎల్లో ఆడగలడో, ఆడలేడో తెలిసేది అంటూ మండిపడుతున్నారు.

శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తన చివరి మ్యాచ్ ఆడుతుండగా.. అందరూ ఈ మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ తప్పకుండా అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. కానీ టాస్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తన జట్టులో రెండు మార్పులు చేశామని స్టబ్స్ స్థానంలో బ్రెవిస్, సంజయ్ స్థానంలో షోకీన్‌ను తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఇక అర్జున్ టెండూల్కర్ ఊసు కూడా ఎత్తలేదు. దీంతో నెట్టింటా అర్జున్ టెండూల్కర్ హ్యాష్ ట్యాగ్‌తో పోస్టులు తీవ్రమయ్యాయి.

వరుసగా రెండేళ్ల పాటు అర్జున్‌కు అన్యాయం

సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను గత ఏడాది ఐపీఎల్ మినీ వేలంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ బేస్ ధరకే కొనుక్కుంది. అయినప్పటికీ ఐపీఎల్ 2021ఎడిషన్‌లో అతన్ని ముంబై ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. ఇక ఈ సీజన్‌కు ముందు అర్జున్ టెండూల్కర్ కోసం రూ.30లక్షల ధర వెచ్చించి మళ్లీ ముంబై అతన్ని దక్కించుకుంది.

ఇకపోతే ముంబై జట్టులో బెంచ్ మీద ఉన్న దాదాపు అందరూ ఆటగాళ్లకు ఈ సీజన్లో అవకాశాలొచ్చాయి. కానీ కేవలం అర్జున్ టెండూల్కర్‌కు మాత్రం ముంబై మొండిచేయి చూపించింది. దీంతో అతన్ని తుది జట్టులో చూడాలనుకున్న అభిమానులు నిరాశచెందారు. ఇక ముంబై జట్టును వీడితే కానీ అర్జున్ టెండూల్కర్ కు మోక్షం దక్కదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఐపీఎల్లో అరంగేట్రం చేయాలంటే మరో ఏడాది వరకు అర్జున్ టెండూల్కర్ వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

సచిన్ కొడుకు అయినందుకేనా ఇలా?

ఓ నెటిజన్ పేర్కొంటూ.. ముంబై ఇండియన్స్ జట్టు సచిన్ కొడుకని కాదు గానీ ఓ క్రీడాకారుడి భవిష్యత్తును దెబ్బతీస్తోంది. మీరు ఆడించలేకపోతే ఇంకో జట్టుకు అతన్ని అమ్మేయండి. అలాగైనా అతను ఐపీఎల్లో ఆడగలుగుతాడు అని పేర్కొన్నాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ముంబై అసలెందుకు అర్జున్ టెండూల్కర్ ను కొన్నట్టు. కేవలం నెట్ బౌలర్ గా తీసుకుంటే అయిపోయేదిగా. పాపం అతన్ని మరీ చిన్నపిల్లాడిలా చూస్తున్నారంటూ వాదించాడు. మరో నెటిజన్ అయితే నెపోటిజం కారణంగా లబ్ధి పొందని ఏకైక ప్లేయర్ అర్జున్ టెండూల్కరే కావొచ్చు అంటూ సానుభూతి ప్రకటించాడు.

ఇకపోతే ఈ మ్యాచ్‌లో ఆడుతున్న ముంబై ప్లేయింగ్ 11 జట్టు

ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), డేనియల్ సామ్స్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్, మయాంక్ మార్కండే

బెంచ్ మీద ఉన్న ప్లేయర్లు : కీరన్ పొలార్డ్, జయదేవ్ ఉనద్కత్, మురుగన్ అశ్విన్, ఫాబియన్ అలెన్, బాసిల్ థంపి, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, అర్జున్ టెండూల్కర్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, రాహుల్ బుద్ధి, ట్రిస్టన్ స్టబ్స్, సంజయ్ యాదవ్

Story first published: Saturday, May 21, 2022, 21:19 [IST]
Other articles published on May 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X