న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సొంత గడ్డపై ఆడిన తొలి వన్డేలో నేపాల్‌ ఓటమి.. నిరాశలో ఫాన్స్!!

Nepals First-ever Home ODI Ends in 18-run Defeat to Oman

ఖాట్మండు: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా సొంత గడ్డపై ఆడిన అధికారిక తొలి వన్డేలోనే నేపాల్‌ ఓడిపోయింది. త్రిభువన్ యూనివర్శిటీ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో బుధవారం ఒమన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నేపాల్‌ 18 పరుగుల తేడాతో పరాజయం చెందింది. దీంతో సొంత గడ్డపై జరుగుతున్న తొలి మ్యాచ్ చూడడానికి వచ్చిన నేపాల్‌ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. నేపాల్‌ వేదికగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నిర్వహిస్తున్న ట్రై సిరీస్‌లో నేపాల్‌తో పాటు అమెరికా, ఒమన్‌లు జట్లు తలపడుతున్నాయి.

ధోనీకి వీరాభిమానిని.. కానీ టీమిండియా భవిష్యత్ కోసం అలా చేయక తప్పలేదు: ఎమ్మెస్కేధోనీకి వీరాభిమానిని.. కానీ టీమిండియా భవిష్యత్ కోసం అలా చేయక తప్పలేదు: ఎమ్మెస్కే

ట్రై సిరీస్‌లో భాగంగా ఒమన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నేపాల్‌ పరాజయం చెందింది. మొదటగా బ్యాటింగ్‌ చేసిన ఒమన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఒమన్‌ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ నదీమ్‌ హాఫ్ సెంచరీ చేసాడు. 96 బంతుల్లో అజేయంగా 69 పరుగులు సాధించాడు. సందీప్ గౌడ్ (33), నసీం ఖుషి (28) పర్వాలేదనిపించారు. నేపాల్ బౌలర్ కరణ్ 4 వికెట్లు తీసాడు. స్టార్ ప్లేయర్ సందీప్ లామిచనే ఒక వికెట్ కూడా తీయలేదు.

లక్ష్య ఛేదనలో నేపాల్‌ 179 పరుగులకే ఆలౌట్ అయింది. శరద్‌ విశ్వాకర్‌ హాఫ్ సెంచరీ (55) చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. ఐరీ (36), భండారి (26) పరుగులు చేసారు. బంతితో విఫలమయిన సందీప్ లామిచనే బ్యాటింగ్‌లో మాత్రం పర్వాలేదనిపించాడు. 27 బంతుల్లో 28 పరుగులు చేసాడు. ఒమన్‌ బౌలర్ జీషన్ మక్సూద్ మూడు వికెట్లు తీసాడు.

దేశం తొలిసారి అధికారిక వన్డే సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వడంపై నేపాల్‌ కెప్టెన్‌ జ్ఞానేంద్ర మల్లా సంతోషం వ్యక్తం చేశాడు. 'దేశం గర్వించే క్షణం ఇది. క్రికెట్‌ ఆడుతున్నప్పట్నుంచీ ప్రతీ ఒక్కరరూ వన్డే హోదా రావాలని కోరుకున్నారు. ఇప్పుడు అతి పెద్ద క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నారు. స్వదేశంలో జట్టుకు కెప్టెన్‌గా ఉండి మ్యాచ్‌ ఆడటం సరికొత్త అనుభూతి. ఖాట్మాండు నా ఫేవరెట్‌ గ్రౌండ్లలో ఒకటి' అని మల్లా తెలిపాడు.

2018లో నేపాల్‌కు వన్డే హోదా దక్కిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీలో మెరుగైన స్థానాల్లో నిలవడం ద్వారా నేపాల్‌తో పాటు స్కాట్లాండ్‌,యూఏఈలు వన్డే హోదా సాధించాయి.

Story first published: Thursday, February 6, 2020, 16:57 [IST]
Other articles published on Feb 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X