న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'టెస్టుల్లో కీపర్‌గా సాహానే ఆడించాలి.. మరో ఆలోచనే వద్దు'

Nayan Mongia, Farokh Engineer open up on Rishabh Pant’s selection over Wriddhiman Saha
Nayan Mongia Open Up On Rishabh Pant’s Selection Over Wriddhiman Saha | Oneindia Telugu

ముంబై: వృద్ధిమాన్ సాహా ఫిట్‌గా ఉంటే టెస్టుల్లో అతడినే ఆడించాలి, ఈ విషయంలో మరో ఆలోచనే వద్దు అని భారత మాజీ వికెట్ కీపర్‌ నయన్‌ మోంగియా అంటున్నారు. టీమిండియా వికెట్‌ కీపర్‌ కన్నా బ్యాట్స్‌మన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు అర్థమవుతోందన్నారు. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ 2-0తో కోల్పోయిన విషయం తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు అందరూ విఫలమయ్యారు. ఇక యువ బ్యాట్స్‌మన్‌, కీపర్‌ రిషభ్‌ పంత్‌ నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి 60 పరుగులు చేసాడు. అత్యధిక వ్యక్తి గత స్కోర్ 25. పంత్ దారుణంగా విఫలమవడంతో సాహానే ఆడించాలని మోంగియా అంటున్నారు.

<strong>వామ్మో.. టాపర్‌గా నిలిచుండకుంటే ఫైనల్‌కు చేరడం కష్టమయ్యేది: హర్మన్‌ప్రీత్‌</strong>వామ్మో.. టాపర్‌గా నిలిచుండకుంటే ఫైనల్‌కు చేరడం కష్టమయ్యేది: హర్మన్‌ప్రీత్‌

బ్యాట్స్‌మన్‌కే ఎక్కువ ప్రాధాన్యం:

బ్యాట్స్‌మన్‌కే ఎక్కువ ప్రాధాన్యం:

నయన్‌ మోంగియా మాట్లాడుతూ... 'నేనెప్పుడూ ఒకే విషయం చెబుతా. సాహా ఫిట్‌గా ఉంటే టెస్టుల్లో అతడినే ఆడించాలి. ఈ విషయంలో మరో ఆలోచనే వద్దు. పంత్‌ను ఆడించడంతో.. టీమిండియా వికెట్‌ కీపర్‌ కన్నా బ్యాట్స్‌మన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు అర్థమవుతోంది. టెస్టుల్లో స్పిన్‌ పిచ్‌ అయినా, పేస్‌ పిచ్‌ అయినా వికెట్ కీపింగ్‌ అనేది ప్రత్యేక బాధ్యత' అని అన్నారు.

సాహానే అత్యుత్తమం:

సాహానే అత్యుత్తమం:

మాజీ కీపర్‌ ఫరూక్‌ ఇంజినీర్ మాట్లాడుతూ... 'టెస్టుల్లో కీపర్‌గా సాహానే అత్యుత్తమం. బ్యాటింగ్‌ విషయానికొస్తే పంత్‌ మ్యాచ్‌ ఫలితాన్ని మార్చేయగలడు. కాబట్టి అతడిని ఎంపిక చేయడం తప్పుకాదు. అయితే వికెట్ల వెనుక మాత్రం అతడు ఎలాంటి పొరపాట్లు చేయలేదు. పంత్‌ ప్రతీసారీ విఫలం అవుతూనే ఉన్నాడు. మ్యాచ్‌ను కాపాడాల్సిన అవసరం ఉన్న సమయంలో జాగ్రత్తగా ఆడుతూ మరిన్ని పరుగులు చేయాలి' అని పేర్కొన్నారు.

పంత్ డైలామాలో పడ్డాడు:

పంత్ డైలామాలో పడ్డాడు:

'ఫామ్‌లో లేని పంత్ డైలామాలో పడ్డాడు. అలాంటి స్థితిలోనైనా అతడు కాస్త దూకుడుగా షాట్లు ఆడాల్సింది. నేను కెప్టెన్‌గా ఉండింటే తన సహజమైన ఆటను ఆడమని చెప్పేవాడిని. ఇక్కడ పంత్‌ మాత్రం తన శైలికి విరుద్ధంగా ఆడాడు' అని ఫరూక్‌ వెల్లడించారు. 'రెండు టెస్టుల్లోనూ పంత్ కీపింగ్ బాగానే చేసాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో కూడా స్టంప్స్ వెనుక బాగా కదిలాడు. అతడు త్వరగా నేర్చుకుంటున్నాడు' అని మరో మాజీ ఆటగాడు కిరణ్ మోరే చెప్పుకొచ్చారు.

Story first published: Thursday, March 5, 2020, 14:49 [IST]
Other articles published on Mar 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X