న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: అయ్యో పుజారా.. 10 సార్లు అతని బౌలింగ్‌లోనే!!

Nathan Lyon dismiss Cheteshwar Pujara for the 10th time in Tests

అడిలైడ్‌: క్రికెట్‌లో కొంతమంది బ్యాట్స్‌మెన్‌ తమకు తెలియకుండానే ప్రతీసారి ఒకే బౌలర్‌కు వికెట్‌ సమర్పించుకుంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ బౌలింగ్‌లో 14 సార్లు ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ కూడా కొంతమంది బౌలర్‌లకు పదేపదే వికెట్ ఇచ్చుకున్నాడు. ఇక ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభం అయిన డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌లో టెస్టు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ చెటేశ్వర్ పుజారా (43: 160 బంతుల్లో 2ఫోర్లు) అద్భుత పోరాటపటిమకనబర్చాడు. గులాబీ టెస్టులో ఏకంగా రెండు సెషన్ల పాటు వికెట్‌ కాపాడుకుంటూ ఆతిథ్య బౌలర్లను ఎదుర్కొన్నాడు.

 10 సార్లు లైయన్‌ బౌలింగ్‌లోనే

10 సార్లు లైయన్‌ బౌలింగ్‌లోనే

రెండు సెషన్ల పాటు చెటేశ్వర్ పుజారా ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వారి సహనానికి పరీక్షపెట్టాడు. చివరకు భారత ఇన్నింగ్స్‌ 50వ ఓవర్లో ఆసీస్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ నాథన్‌ లైయన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. టెస్టుల్లో లైయన్‌ బౌలింగ్‌లో పుజారా ఔటవడం ఇది పదోసారి కావడం గమనార్హం. సుదీర్ఘ ఫార్మాట్‌లో పుజారా ఎక్కువసార్లు లైయన్‌ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. పుజారాను ఎక్కువసార్లు ఔట్ చేసిన జాబితాలో ఇంగ్లాండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ రెండో స్థానంలో ఉన్నాడు. పుజారాను అండర్సన్‌ ఏడుసార్లు ఔట్‌ చేశాడు.

148 బంతికిగానీ

148 బంతికిగానీ

డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌లో చెటేశ్వర్ పుజారా తన మార్క్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. గులాబీ బంతితో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ఫాస్ట్ బౌలర్లకి మొదట పిచ్ అనుకూలించడం, కొత్త బంతి నుంచి స్వింగ్ లభిస్తుండటంతో పుజారా అతి జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. తొలి సెషన్‌లో వరుస డిఫెన్స్‌తో ఆస్ట్రేలియా బౌలర్ల సహనాన్ని పరీక్షించిన పుజారా.. ఏ దశలోనూ సాహసోపేత షాట్‌కి ప్రయత్నించలేదు. ఎంతలా అంటే? పుజారా తన మొదటి బౌండరీని 148 బంతికిగానీ కొట్టలేదు. అతని ఇన్నింగ్స్‌లో మొత్తం రెండు బౌండరీలు ఉండగా.. అవి కూడా బ్యాక్ టు బ్యాక్ స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో కొట్టినవే.

డీఆర్‌ఎస్‌కి వెళ్లిన ఆస్ట్రేలియా

డీఆర్‌ఎస్‌కి వెళ్లిన ఆస్ట్రేలియా

నాథన్‌ లైయన్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టిన చెటేశ్వర్ పుజారా.. అతని ఓవర్‌లోనే అనూహ్యరీతిలో వికెట్ ఇచ్చేశాడు. బంతిని డిఫెన్స్ చేసేందుకు పుజారా ప్రయత్నించగా.. ఊహించని విధంగా బౌన్స్ అయిన బంతి అతని చేతి గ్లోవ్స్‌ని తాకి నేరుగా వెళ్లి ఫీల్డర్ లబుషేన్ చేతుల్లో పడింది. అయితే ఫీల్డ్ అంపైర్ మాత్రం తొలుత ఔట్ ఇవ్వలేదు. కానీ డీఆర్‌ఎస్‌కి వెళ్లిన ఆస్ట్రేలియా ఎట్టకేలకి పుజారా వికెట్‌ని దక్కించుకోగలిగింది. అయితే పుజారా ఆటతీరుపై సోషల్‌ మీడియాలో ఫన్నీ ట్రోల్స్‌ వస్తున్నాయి. 'అసలైన టెస్టు క్రికెటర్‌ అంటే పుజారానే' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'మా పుజారా సిమెంట్..‌ అంబుజా సిమెంట్‌ కంటే దృడంగా ఉంటుంది' అని మరొకరు ట్వీటారు. 'పుజారా కట్టే గోడ.. ద్రవిడ్‌ గోడ కన్నా బలంగా ఉంటుంది', 'ద్రవిడ్‌ తర్వాత మాకు మరో వాల్‌ దొరికాడు' అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Year Ender 2020: చిచ్చు పెట్టిన ఆస్ట్రేలియా జ‌ర్న‌లిస్ట్‌.. గొడవపడిన కోహ్లీ, రోహిత్‌ ఫ్యాన్స్!!

Story first published: Friday, December 18, 2020, 13:37 [IST]
Other articles published on Dec 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X