న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇటీవలే జాతీయ జట్టులో అరంగేట్రం.. మళ్లీ జూనియర్‌ జట్టులోకి!!

Naseem Shah named in Pakistans U19 World Cup squad

కరాచీ: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో యువ బౌలర్ నసీమ్‌ షా పాకిస్తాన్‌ జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసాడు. ఇంతలోనే మళ్లీ పాక్ జూనియర్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జరగబోయే అండర్-19 ప్రపంచకప్ కోసం 15 మందితో కూడిన పాకిస్తాన్ జట్టును పీసీబీ శుక్రవారం ప్రకటించింది. ఈ ప్రపంచకప్ జట్టులో 16 ఏళ్ల నసీమ్‌ షా చోటు దక్కించుకున్నాడు. పాక్ అండర్-19 జట్టులో నసీమ్‌ షాను ఎంపిక చేస్తూ పాక్‌ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.

నేడు నలుగురి భారత ఆటగాళ్ల బర్త్‌డే.. వారు ఎవరో తెలుసా!!?నేడు నలుగురి భారత ఆటగాళ్ల బర్త్‌డే.. వారు ఎవరో తెలుసా!!?

 ఒక టెస్ట్.. ఒక వికెట్‌:

ఒక టెస్ట్.. ఒక వికెట్‌:

ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నసీమ్‌ షా తొలి టెస్టులో మాత్రమే ఆడి ఒక వికెట్‌ తీసాడు. సెంచరీ చేసిన ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ను షా ఔట్‌ చేశాడు. ఆస్ట్రేలియా-ఎతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో సత్తాచాటిన నసీమ్‌ షా.. కీలక మ్యాచ్‌లో మాత్రం నిరూపించుకోలేకపోయాడు. దీంతో రెండు టెస్టులో చోటు కోల్పోయాడు. ఇప్పటివరకు నసీమ్‌ కేవలం ఎనిమిది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.

కెప్టెన్‌గా రోహైల్ నజీర్:

కెప్టెన్‌గా రోహైల్ నజీర్:

పాక్ అండర్-19 జట్టుకు వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌ రోహైల్ నజీర్ నాయకత్వం వహించనున్నాడు. 18 ఏళ్ల నజీర్ ఇప్పటికే తొమ్మిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఇటీవల శ్రీలంకలో ముగిసిన అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక ఓపెనర్ హైదర్ అలీ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

స్కాట్లాండ్‌తో తొలి పోరు:

స్కాట్లాండ్‌తో తొలి పోరు:

పాక్‌ ప్రకటించిన జట్టులో ముగ్గురు ఓపెనర్లు, ముగ్గురు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌లు, ఒక వికెట్‌ కీపర్‌, ముగ్గురు ఆల్‌ రౌండర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నారు. పాకిస్తాన్‌ 2004, 2006 అండర్‌-19 ప్రపంచకప్‌లలో విజేతగా నిలిచింది. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో జనవరి 19న స్కాట్లాండ్‌తో పాక్ తలపడనుంది. జనవరి 22న జింబాబ్వేతో, 24న బంగ్లాదేశ్‌తో పాక్ పోటీ పడుతుంది.

 Pakistan Squad:

Pakistan Squad:

Abdul Wahid Bangalzai, Haider Ali, Mohammad Shehzad, Mohammad Huraira, Mohammad Irfan Khan, Rohail Nazir (c) Abbas Afridi, Fahad Munir, Qasim Akram, Amir Ali, Arish Ali Khan, Amir Khan, Naseem Shah, Tahir Hussain, Mohammad Haris.

Story first published: Friday, December 6, 2019, 16:55 [IST]
Other articles published on Dec 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X