న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రశంసల వర్షం: క్రికెట్‌లో మైకేల్ జోర్డాన్ నా కుమారుడే

 My son Jofra can be Michael Jordan of cricket: Frank Archer


హైదరాబాద్: ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు తొలిసారి విశ్వవిజేతగా నిలవడంతో జోఫ్రా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సూపర్ ఓవర్‌లో ఎంతో ఒత్తిడిని తట్టుకోని అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్ తండ్రి ఫ్రాంక్ ఆర్చర్ తన కుమారుడిపై ప్రశంసల వర్షం కురిపించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

యావత్ ప్రపంచం మొత్తం వీక్షించింది

యావత్ ప్రపంచం మొత్తం వీక్షించింది

తన కుమారుడి వేసిన సూపర్ ఓవర్‌ను యావత్ ప్రపంచం మొత్తం వీక్షించిందని తెలిపాడు. సరైన సమయంలో తన కుమారుడు గూడ్స్‌ను ఖచ్చితంగా డెలివరీ చేశాడని చెప్పుకొచ్చాడు. జోఫ్రా ఆర్చర్ సక్సెస్‌ను ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటారని తెలిపాడు. రాబోయే రోజుల్లో జోఫ్రా ఆర్చర్ ఎలైట్ జాబితాలో తప్పక చోటు దక్కించుకుంటాడని అన్నాడు.

జోఫ్రాతో చెప్పాను

జోఫ్రాతో చెప్పాను

"నేను జోఫ్రాతో చెప్పాను... క్రికెట్‌కు మైకేల్ జోర్డాన్ అవుతావని అన్నాను. క్రికెట్‌తో అతడి ప్రమేయం సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక అంశాలలో అన్ని నేపథ్యాలను కలిగి ఉన్న వారిని తీసుకు వస్తుంది. క్రికెట్‌లో మంతో మంది ఎలైట్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే, జోఫ్రా మాత్రం క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటే మంచి లైఫ్ ఉంటుందని చూపించాడు" అని తెలిపాడు.

సాధించే దిశగా కష్టపడాలి

సాధించే దిశగా కష్టపడాలి

"మిడిల్ క్లాస్ అని బాధపడొద్దు... మీరు చేయాల్సిందిల్లా దానిని సాధించే దిశగా కష్టపడాలి. అతడే మీకు స్ఫూర్తి" అని జోఫ్రా ఆర్చర్ తండ్రి ప్రాంక్ ఆర్చర్ అన్నాడు. ఇక, జోప్రా ఆర్చర్ వేసిన సూపర్ ఓవర్‌లో కివీస్ బ్యాట్స్‌మన్ జేమ్స్ నీషమ్ సిక్స్ బాదిన సంఘటనపై కూడా ఫ్రాంక్ స్పందించాడు.

ఆ ఆరు పరుగులు భయపెట్టాయి

ఆ ఆరు పరుగులు భయపెట్టాయి

"ఆ ఆరు పరుగులు అందరినీ కాస్త భయపెట్టాయి. కానీ, ఆర్చర్ మాత్రం దానిని అధిగమించాడు. గొప్ప ఆటగాళ్ళు మాత్రమే అలా చేయగలుగుతారు. క్రెడిట్ మొత్తం కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కే దక్కుతుంది. అతడిపై పెట్టుకున్న విశ్వాసాన్ని తిరిగి చెల్లించాడు. దీంతో అతడి స్టోరీ అద్భుతం. ఇది జోఫ్రా ఆర్చర్ ప్రదర్శన, ఇది ఇప్పుడే ప్రారంభమైంది" అని అన్నాడు.

Story first published: Friday, July 19, 2019, 17:19 [IST]
Other articles published on Jul 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X