న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్‌ నాకు ఆదర్శం.. అతడిలా బ్యాటింగ్‌ చేయాలనుంది: పాక్ క్రికెటర్

My idol is Rohit Sharma: Haider Ali wants to bat like India opener
Rohit Sharma Is My Idol Wants To Bat Like India Opener Says Pak Player Haider Ali

కరాచీ: టీమిండియా పరిమిత ఓవర్ల వైస్‌కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తనకి ఎంతో ఆదర్శమని పాకిస్థాన్‌ యువ క్రికెటర్‌ హైదర్‌ అలీ అన్నాడు. భవిష్యత్తులో అతను ఓపెనర్ రోహిత్ లాగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాడు. గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ క్రికెట్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హైదర్ అలీ. అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఇటీవల పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో 9 మ్యాచ్‌లాడిన హైదర్.. 158.27 స్ట్రైక్‌రేట్‌తో 239 పరుగులు చేశాడు. దీంతో పాకిస్థాన్ నుంచి త్వరలో ప్రపంచస్థాయి బ్యాట్స్‌మెన్ రాబోతున్నాడని ఆ దేశ మాజీలు అంటున్నారు.

<strong>సచిన్‌ vs లారా.. ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మెన్ ఎవరో చెప్పిన వార్న్‌!!</strong>సచిన్‌ vs లారా.. ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మెన్ ఎవరో చెప్పిన వార్న్‌!!

రోహిత్‌ నాకు ఆదర్శం:

రోహిత్‌ నాకు ఆదర్శం:

'టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మనే నాకు ఆదర్శం. అతడి స్ట్రైక్‌రేట్‌ అద్భుతంగా ఉంటుంది. నేను కూడా అలానే బ్యాటింగ్‌ చేయాలని భావిస్తున్నా' అని 19 ఏళ్ల హైదర్‌ అలీ అన్నాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన హైదర్.. మహమ్మారి కరోనా కారణంగా పీఎస్ఎల్‌ లీగ్ వాయిదా పడక ముందు పెషావర్ జల్మి తరఫున దుమ్మరేపాడు. ఏకంగా 239 పరుగులు చేశాడు. దీంతో హైదర్ మరోసారి స్టార్ అయ్యాడు.

అజామ్‌ అని పిలవండి:

అజామ్‌ అని పిలవండి:

ఇప్పటికే పాక్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్‌, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలతో హైదర్‌ అలీని పోలుస్తున్నారు. కోహ్లీ, అజామ్‌తో తనని పోలుస్తుండటంపై హైదర్ స్పందించాడు. నన్ను కోహ్లీ అని కాకుండా.. బాబర్ అని పిలవండి అని ఇటీవలే హైదర్‌ విజ్ఞప్తి చేసాడు. బాబర్ షాట్ సెలక్షన్ చాలా బాగుంటుందని పేర్కొన్నాడు. 'ఏ బ్యాట్స్‌మెన్ కూడా తన ఆరాధ్య క్రికెటర్‌ స్థాయిని అందుకోలేడు. కానీ.. అతనిలా ఆడటం మాత్రం నేర్చుకోవచ్చు. వారి ఆటను చూస్తూ.. తనను తాను మెరుగుపరుచుకోగలడు. నాకు అజామ్‌లా ఎదగాలని ఉంది. ప్రజలు అందరూ నన్ను అజామ్‌ అని పిలిస్తే సంతోషిస్తా. అంతేకాని కోహ్లీ అని కాదు' అని అన్నాడు.

మరో కోహ్లీ:

మరో కోహ్లీ:

ఇటీవలే ఓ యూట్యూబ్ వీడియోలో పాక్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజా మాట్లాడుతూ.. 'హైదర్ అద్భుత నైపుణ్యం ఉన్న ఆటగాడు. తొలి సీజన్‌లోనే తన పేరు మారుమోగేలా ఆడాడు. కాకపోతే అతను తన పెర్ఫామెన్స్‌లో స్థిరత్వం తీసుకురావాలి. బ్యాటింగ్ ఆర్డర్‌ కూడా మూడో స్థానమే. షాట్లు కొట్టే విషయంలో మంచి నైపుణ్యం కలిగి ఉన్నాడు. విధ్వంసకరంగా ఆడే విషయంలో మెరుగుపరుచుకోవాల్సింది ఏం లేదు. కోహ్లీ, బాబర్‌ల విధానాన్ని హైదర్ అనుసరించాలి. హైదర్‌కు కూడా బాబర్,కోహ్లీ మాదిరే నైపుణ్యం ఉంది. కాకపోతే అతను తన ఆటపై ఓ అవగాహనకు వచ్చి భారీ ఇన్నింగ్స్‌లు ఆడాల్సిన అవసరం ఉంది' అని తెలిపాడు.

Story first published: Tuesday, March 31, 2020, 11:37 [IST]
Other articles published on Mar 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X