న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అఫ్గన్ బౌలర్లకు ఇదొక ప్రత్యేకమైన రోజు'

Must be a Special Day for Afghanistan - Twitter Rejoices After Afghan Thriller in Asia Cup

దుబాయ్: టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్‌ను ఓటిమి అంచుల వరకూ తీసుకెళ్లిన అఫ్గనిస్తాన్ చేజాతులారా కాస్తలో ఫలితంలో అజమాయిషీ చూపించలేకపోయింది. మ్యాచ్ ముందు సునాయాస విజయాన్ని అందుకోవచ్చనే ఉద్దేశ్యంతో టీమిండియా జట్టులో మార్పులు చేసి ఓపెనర్లిద్దరినీ పక్కన పెట్టింది. ధోనీని తాత్కాలిక కెప్టెన్‌గా నిలబెట్టి 200వన్డే ఆడాలని సూచించింది. ఈ క్రమంలో బరిలోకి దిగిన ఇరు జట్లు హోరాహోరీ సమరంలో పోరాడాయి.

ఇలా ఆసియాకప్‌లో భారత్‌కు ఊహించని ఫలితం ఎదురైంది. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో విజయం ఖాయం అనుకున్నా.. మ్యాచ్‌ అనూహ్యంగా టైగా ముగిసింది. రాయుడు, రాహుల్‌ మెరిసినా 253 పరుగుల ఛేదనలో భారత్‌ 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు చేసింది.

ఈ క్రమంలో టీమిండియాపై విజయం సాధించడంతో అఫ్గనిస్తాన్‌ను ట్వీట్లతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. వారితో పాటు దిగ్గజాలు సైతం ట్వీట్ల ద్వారా అఫ్గాన్ జట్టును ప్రశంసిస్తున్నారు.

క్రికెట్‌లోనే ఇదో గ్రేట్ గేమ్

క్రికెట్‌లోనే ఇదో గ్రేట్ గేమ్. వరల్డ్ క్లాస్ జట్టు ఇండియాపై అఫ్గాన్ అద్భుత ప్రదర్శన చేసింది. షెహజాద్ సెంచరీ ఆకట్టుకుంది.

అఫ్గనిస్తాన్ బౌలర్లకు ప్రత్యేకమైన రోజు

నిజంగా అఫ్గనిస్తాన్ బౌలర్లకు ఇదొక ప్రత్యేకమైన రోజు, టీమిండియాతో మ్యాచ్ టై చేసుకుని అద్భుతమైన లక్ష్యాన్ని చేరుకోగలిగింది. ఈ ప్రదర్శనకు ప్రతి ఒక్క అఫ్గాన్ ఆటగాడు గర్వించాలి. ప్రస్తుత ఆసియా కప్ టోర్నీలో అఫ్గాన్ జట్టు ఓ ప్రత్యేకతను చాటుకుంది.

అఫ్గనిస్తాన్ క్రికెట్ అభిమానిగా:

అఫ్గనిస్తాన్ క్రికెట్ అభిమానిగా నేను కొంతసేపటికి వరకూ గందరగోళానికి గురైయ్యాను. గేమ్‌లో కీలకమైన వ్యక్తిగా నా మిత్రుడు షెహజాద్ నిలిచాడు. మీ విజాయాన్ని ఇలానే కొనసాగించండి.

ఓహ్.. అఫ్గనిస్తాన్.. ఏం జట్టు

ఓహ్.. అఫ్గనిస్తాన్.. ఏం జట్టు. సూపర్ 4లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్‌ను చూసినందుకు చాలా సంతృప్తినిచ్చింది. టోర్నీలో అఫ్గాన్ జట్టు ఉద్వేగాన్ని పుట్టించింది. ఫాషన్‌తో వాళ్లు మనసులు గెలుచుకున్నారు.

Story first published: Wednesday, September 26, 2018, 12:42 [IST]
Other articles published on Sep 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X