న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాగిని డ్యాన్స్ అంత పని చేయనుందా..?

Mushfiqur Rahim’s nagin dance is replete with commercial possibilities

హైదరాబాద్: ఏదైనా జట్టు ఓడిపోతే ఆ జట్టు గురించి కాసేపే మాట్లాడుకుంటారు. అలాంటిది మ్యాచ్ ఓడిపోయి మూడు రోజులు గడిచిపోయినా కూడా ఇంకా గుర్తు చేసుకుంటున్నారంటే.. మ్యాచ్ ప్రదర్శనను బట్టే. ఇలా శుక్రవారం శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో బంగ్లా ఆటగాడు రెచ్చిపోయి సంబరాలు చేసుకున్నాడు. 35బంతుల్తో 72పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అనంతరం తనదైన శైలీలో నాగిని డ్యాన్స్ చేసి చూపిస్తూ.. స్టేడియం వైపుకు తిరిగి సంబరాలు చేసుకున్నాడు.

అయితే ఈ నాగిని డ్యాన్స్ ఇక్కడితో ఆగిపోయేట్లు కనిపించట్లేదు. ఇది ఫ్యామస్ అయిన తీరు చూస్తుంటే ఎడ్వర్టైజ్‌మెంట్ వాళ్లు పూర్తిగా వాడుకునే అవకాశాలు లేకపోలేదు. మ్యాచ్ జరుగుతండగా ఏ పాల ఉత్పత్తో.. ఏ బిస్కట్ కంపెనీలో మా ప్రొడక్ట్స్ వాడితే ఇలానే విజేతలవుతారు అనడంలో సందేహమే లేదనిపిస్తోంది.

దీంతో అతను ఈ టోర్నీ మొత్తానికి హైలెట్‌గా మారాడు. సరదాగా అతనిని అనుకరిస్తూ.. ధావన్, సునీల్ గవాస్కర్‌లు సైతం నాగిని డ్యాన్స్ చేసి చూపించారు. ఇక ఫైనల్ మ్యాచ్‌లో అయితే భారత్ జట్టు గెలుస్తుందనే సమయంలో నాగిని డ్యాన్స్ స్టేడియం అంతా మార్మోగిపోయింది.

ఇలా క్రీడల్లో సెలబ్రేషన్లు చేసుకోవడం సర్వసాధారణమైన విషయమే. కానీ, ఎప్పటికప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇలానే 1994 వరల్డ్ కప్ ఆడుతుండగా కొడుకు పుట్టిన ఆనందంలో రాక్ ద బేబీ అంటూ స్టేడియంలోనే చిందులేశాడు మెక్సికోకు చెందిన బెబెటో.. మ్యాచ్ గెలిచిన ఆనందంలో గంగూలీ లార్డ్స్ స్టేడియంలో చొక్కా విప్పి తిరిగిన సందర్భాలు లేకపోలేదు.

Story first published: Wednesday, March 21, 2018, 9:37 [IST]
Other articles published on Mar 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X