మమ్మల్ని అద్భుతంగా ఓడించాడు: లంక కెప్టెన్

Posted By:
Mushfiqur Rahim’s knock best I have seen: Dinesh Chandimal, Sri Lanka captain

హైదరాబాద్: ఓడిపోయినా సరే.. ప్రతిభను గౌరవించాల్సిందే అనే రీతిలో లంక జట్టు కెప్టెన్ చంఢీమాల్ బంగ్లాదేశ్ ఆటగాడిని పైకెత్తేస్తున్నాడు. తమ నుంచి విజయాన్ని దూరం చేసిన బంగ్లాదేశ్‌ ఆటగాడు ముష్పికర్‌ రహీమ్‌పై శ్రీలంక కెప్టెన్‌ దినేశ్‌ చండిమాల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. తాము నిర్దేశించిన భారీ లక్ష్యాన్నిఛేదించే క్రమంలో ముష్పికర్‌ ఆడిన తీరు నిజంగా అద్భుతమని కొనియాడాడు.

ఇప్పటివరకు తాను చూసిన ముష్పికర్‌ ఇన్నింగ్స్‌ల్లో ఇదే అత్యుత్తమమైన ప్రదర్శన అంటూ చండిమాల్‌ కొనియాడాడు. 'ముష్పికర్‌ అసాధారణ రీతిలో ఆడాడు. నేను చూసిన ముష్పికర్‌ ఇన్నింగ్స్‌ల్లో ఇదే ఉత్తమమైనది. పరిస్థితులకు తగ్గట్లు ఆడిన ముష్పికర్‌ మాకు విజయాన్ని దూరం చేశాడు. మిగతా బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు సమయోచితంగా రాణించారు' అని చండిమాల్‌ తెలిపాడు.

ఇక తొలి ఆరు ఓవర్లలోపే స్నిన్నర్‌ అకిల దనంజయకు బౌలింగ్‌ ఇవ్వడాన్ని చండిమాల్‌ సమర్ధించుకున్నాడు. తమ జట్టులో అతనొక స్టార్‌ బౌలర్‌ అని, గత కొంతకాలం నుంచి నిలకడగా బౌలింగ్‌ చేయడం వల్లే ముందుగా బౌలింగ్‌ ఇచ్చామన్నాడు. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో ముష్పికర్‌ 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయంగా 72 పరుగులు సాధించి బంగ్లాదేశ్‌ సంచలన విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌ను మంచి క్రికెట్‌ గేమ్‌గా అభివర్ణించిన చండిమాల్‌.. తమ బౌలింగ్ తీరు బాగాలేకపోవడం వల్లే ఓటమికి గురైయ్యామని పేర్కొన్నాడు. కానీ, బ్యాటింగ్‌ తీరు అమోఘంగా ఉందన్నాడు. వచ్చే మ్యాచ్‌లో ఈ పొరబాటు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపాడు చండిమాల్‌. తదుపరి గేమ్‌లో పక్కా ప్రణాళికల్ని అమలు చేయడంపైనే దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొన్నాడు.

Story first published: Sunday, March 11, 2018, 15:50 [IST]
Other articles published on Mar 11, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి