న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'జట్టులోకి తీసుకోకపోతేనేం.. జీవితం చాలా ఉంది'

Murali Vijay comes up with a cryptic message after being omitted from the Test squad

న్యూ ఢిల్లీ: టీమిండియా సెలక్షన్ కమిటీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముగిసిన ఆసియా కప్‌లోనూ.. జరగబోయే వెస్టిండీస్‌తో మ్యాచ్‌లలోనూ కొందరి ఆటగాళ్లను తప్పించి పదహారు మందితో కూడిన జట్టును ప్రకటించేసింది. అయితే ఇందులో చోటు దక్కించుకోకపోవడం పట్ల క్రికెటర్‌లు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. త్రిశతక వీరుడు కరుణ్ నాయర్ అయితే అవకాశం వచ్చినప్పుడు బ్యాట్‌తోనే సమాధానం చెప్తానంటోంటే.. మురళీ విజయ్ దానికి విరుద్ధంగా పేర్కొన్నాడు.

స్టార్ క్రికెటర్లను తప్పించి పృథ్వీ షా.. హనుమ విహారీలను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. కొత్తగా మయాంక్ అగర్వాల్.. మొహమ్మద్ సిరాజ్‌లకు అవకాశం దక్కింది. వీరందరినీ తీసుకున్న సెలక్టర్లు మురళీ విజయ్‌ని తీసుకోకపోవడానికి కారణాలున్నాయి. ఆసియా కప్‌కు ముందు ఇంగ్లాండ్ పర్యటన చేపట్టిన టీమిండియా టెస్టు సిరీస్‌లోని మొదటి రెండు టెస్టులకు మురళీ విజయ్ ఆడేందుకు అవకాశమిచ్చింది. ఆ రెండు మ్యాచ్‌లలోనూ చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోగా.. ఆశించిన మేర రాణించలేకపోయాడు.

దీంతో ఆ సిరీస్‌లోనే పక్కన పెట్టేసింది టీమిండియా. ఇక తర్వాత పరిమిత ఓవర్ల సిరీస్‌లో జరిగిన ఆసియా కప్‌లోనూ టీమిండియాలో భాగం కాలేకపోయాడు మురళీ విజయ్. అతని పేలవ ఫామ్‌ను దృష్టిలో ఉంచుకున్న సెలక్టర్లు వెస్టిండీస్‌తో మ్యాచ్‌లకు వేటు విధించారు. అతనితో పాటుగా ధావన్‌ను కూడా జట్టులోకి తీసుకోలేదు. దీంతో వాళ్లిద్దరికీ ఇక దేశీవాలీ క్రికెట్‌లో ఆడకతప్పదేమోననే పరిస్థితి కనిపిస్తోంది. కరుణ్ నాయర్ విషయంలోనూ ఎమ్మెస్కే ప్రసాద్ ఇదే అంటున్నాడు.

భారత్ ఏ, దేశీవాలీ ట్రోఫీల్లో ఆడి తన సత్తా మెరుగుపరుచుకుంటే జట్టులోకి తీసుకుంటామని చెప్పుకొచ్చాడు. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా మురళీ విజయ్ మాత్రం తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఇలా పేర్కొన్నాడు. 'దీంతోనే అంతా అయిపోలేదు. ఇంకా చాలా జీవితముంది. నన్ను ఇలాంటి పరిస్థితుల్లోనూ వెన్నంటే నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు' అంటూ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, October 2, 2018, 15:40 [IST]
Other articles published on Oct 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X