న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబై వల్లే: ఐపీఎల్ చరిత్రలోనే కోల్‌కతా చెత్త ఓటమి నమోదు

By Nageshwara Rao
Mumbai Indians hand KKR their worst defeat in IPL history

హైదరాబాద్: ఐపీఎల్ చరిత్రలోనే కోల్‌కతా నైట్‌రైడర్స్ చెత్త ఓటమిని నమోదు చేసింది. టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 102 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలోనే కోల్‌కతా ఇంత ఘోరంగా ఓడిపోవడం ఇదే మొదటిసారి.

ఈ విజయం ముంబై ఇండియన్స్‌కి ఈ సీజన్‌లో వరుసగా మూడో విజయం కాగా, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుపై వరుసగా ఎనిమిదో విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ దారుణంగా విఫలం

కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ దారుణంగా విఫలం

అనంతరం ముంబై నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ దారుణంగా విఫలమవడంతో 18.1 ఓవర్లలో 108 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఐపీఎల్ 11వ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.

 ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్షిష్టం చేసుకున్న కోల్‌కతా

ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్షిష్టం చేసుకున్న కోల్‌కతా

తాజా విజయంతో ముంబై ఇండియన్స్ 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకగా... ప్లే ఆఫ్స్ అవకాశాలను కోల్‌కతా సంక్షిష్టం చేసుకుంది. ముంబై బౌలర్లలో పాండ్యా బ్రదర్స్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. మార్కండేయ, బెన్ కటింగ్‌, బుమ్రా, మెక్లన్‌గన్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో రెండు రనౌట్‌లు ఉండటం విశేషం.

17 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్

17 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్

ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 17 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ సీజన్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ 14 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించి ఐపీఎల్‌ చరిత్రలోనే వేగవంతమైన సెంచరీ నమోదు చేయగా.. కోల్‌కతా ఆటగాడు సునీల్‌ నరైన్‌ 17 బంతుల్లో హాఫ్ సెంచరీని నమోదు చేశారు.

ఇషాన్ కిషన్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు

ఇషాన్ కిషన్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు

ఈ మ్యాచ్‌లో 21 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 62 పరుగులు చేసిన ముంబై బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా దారుణ ఓటమికి గాను ఆ జట్టు సహా యజమాని బాలీ‌వుడ్ నటుడు షారుక్ ఖాన్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు క్షమాపణలు తెలిపిన సంగతి తెలిసిందే.

అభిమానులకు క్షమాపణ చెబుతున్నా

'ఆటల్లో గెలుపు, ఓటములు సహజమే అయినా.. ఇవాళ మాత్రం మా టీమ్ కనీస పోరాట స్ఫూర్తిని ప్రదర్శించలేకపోయినందుకు అభిమానులకు క్షమాపణ చెబుతున్నాను' అని షారుక్ ట్వీట్ చేశాడు. ఐపీఎల్‌లో కోల్‌కతాతో 23 మ్యాచ్‌లాడిన ముంబై 18 సార్లు గెలవడం విశేషం. చివరి 8 మ్యాచుల్లోనూ కోల్‌కతాపై ముంబై విజయం సాధించింది.

Story first published: Thursday, May 10, 2018, 16:02 [IST]
Other articles published on May 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X