న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దుండగుల దాడి.. క్రికెటర్‌ దారుణ హత్య

Mumbai Cricketer Rakesh Panwar stabbed to death by three unknown assailants

మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ స్థానిక క్రికెటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ముంబైలోని బంధూప్‌ ప్రాంతంలో గురువారం రాత్రి క్రికెటర్‌ రాకేశ్‌ పన్వార్‌ను గుర్తు తెలియని ముగ్గురు దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. రాకేశ్‌ అతని ప్రియురాలితో ఉన్నప్పుడు ఈ హత్య జరిగిందని సమాచారం తెలుస్తోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే దుండగులు ఎవరన్నది మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. హత్య జరిగిన సమయంలో రాకేశ్‌ ప్రియురాలు ఉండడంతో.. ఆమెను పోలీసులు విచారించనున్నారు. అయితే రాకేశ్‌ పన్వార్‌ హత్యపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

రాకేశ్‌ చిన్ననాటి స్నేహితుడు గోవింద్‌ రాథోడ్‌ మీడియాతో మాట్లాడాడు. 'హత్య సమయంలో నేను అతనితో లేను. రాకేశ్‌ అతని ప్రియురాలితో ఉన్నప్పుడు ఈ హత్య జరిగింది. ఖాన్‌ కుటుంబంతో రాకేశ్‌కు శత్రుత్వం ఉంది. వారే రాకేశ్‌ పన్వార్‌ను హత్య చేసి ఉంటారు' అని గోవింద్‌ అనుమానం వ్యక్తం చేశారు. రాకేశ్‌ యువ క్రికెటర్లకు శిక్షణ కూడా ఇచ్చేవాడు అని గోవింద్‌ తెలిపాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలా దారుణ హత్యకు గురైన వారు లేకున్నా.. ఫీల్డింగ్, బ్యాటింగ్ చేస్తుండగా మరణించిన వారు చాలా మందే ఉన్నారు. డజనుకుపైగా మందే మైదానంలో గాయపడి మరణించారు. రికార్డుల ప్రకారం.. మొదటగా ఇంగ్లండ్ క్రీడాకారుడు జాస్పర్ వినాల్ గాయపడి మరణించాడు. ఈ దశాబ్దంలో ముగ్గురు ఆటగాళ్లు ఆన్-ఫీల్డ్ గాయాలకు బలయ్యారు. డార్రెన్ రండల్ (దక్షిణాఫ్రికా), ఫిలిప్ హుఘ్స్ (ఆస్ట్రేలియా), రేమండ్ వాన్ (నమీబియా )లు మరణించారు.

Story first published: Friday, June 7, 2019, 13:24 [IST]
Other articles published on Jun 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X