న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీకి వీరాభిమానిని.. కానీ టీమిండియా భవిష్యత్ కోసం అలా చేయక తప్పలేదు: ఎమ్మెస్కే

MSK Prasad says As big a fan of MS Dhoni as anyone else

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి వీరాభిమానిని, నాలా ఇంకెవరూ ఉండరు అని భారత మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. నేను ధోనీకి వీరాభిమానిని అయినా టీమిండియా భవిష్యత్ కోసం యువకులకు అవకాశాలిచ్చా అని అన్నాడు. రోహిత్ శర్మ మా నమ్మకాన్ని నిలబెట్టాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా ఉన్నాడు, అతని ప్రతిభ తెలిసే టెస్ట్ ఫార్మాట్‌లో అవకాశాలు ఇచ్చాం అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు.

మా ముందు భారత్ నిర్దేశించిన లక్ష్యం చిన్నదైపోయింది: కివీస్ కెప్టెన్మా ముందు భారత్ నిర్దేశించిన లక్ష్యం చిన్నదైపోయింది: కివీస్ కెప్టెన్

ధోనీకి వీరాభిమానిని:

ధోనీకి వీరాభిమానిని:

తాజాగా ఎమ్మెస్కే ప్రసాద్ స్పోర్ట్స్ స్టార్‌తో మాట్లాడుతూ... 'ఒక ప్యానెల్ సభ్యునిగా ప్రొఫెషనల్ డ్యూటీని పక్కన పెడితే.. ఎంఎస్ ధోనీకి వీరాభిమానిని. ధోనీ కెప్టెన్‌గా రెండు ప్రపంచకప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. టెస్టుల్లోనూ జట్టును నెం.1 స్థానంలో నిలిపాడు. ఈ ఘనతలపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. రిటైర్మెంట్ గురించి మహీనే నిర్ణయం తీసుకోవాలి. ఒక సెలక్టర్‌గా టీమిండియా భవిష్యత్ గురించి ఆలోచించి యువ క్రికెటర్లకి అవకాశాలు ఇచ్చా' అని తెలిపాడు.

ఐపీఎల్ కోసం ప్రాక్టీస్:

ఐపీఎల్ కోసం ప్రాక్టీస్:

గత ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత భారత జట్టుకి ధోనీ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో సెలక్షన్ కమిటీ యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌, కేఎల్ రాహుల్‌లకి అవకాశాలు ఇచ్చింది. పంత్‌ విఫలమవగా.. రాహుల్ మాత్రం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మరోవైపు ధోనీ రీఎంట్రీపై సందేహాలు నెలకొన్నాయి. అయితే అక్టోబరులో టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో అప్పటిలోగా రీఎంట్రీ ఇస్తాడని అభిమానులు ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం మహీ ఐపీఎల్ 2020 సీజన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు.

రోహిత్ నమ్మకాన్ని నిలబెట్టాడు:

రోహిత్ నమ్మకాన్ని నిలబెట్టాడు:

'మా హయాంలో రోహిత్ శర్మ ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా ఉన్నాడు. అతని ప్రతిభ తెలిసే టెస్ట్ ఫార్మాట్‌లో అవకాశాలు ఇచ్చాం. ఓపెనర్‌గా టెస్ట్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. డబుల్ సెంచరీలతో వైట్ బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. గత నాలుగైదు నెలల్లో టెస్ట్ ఓపెనర్‌గా మంచి ప్రదర్శన చేసాడు. మా నమ్మకాన్ని నిలబెట్టాడు' అని ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు.

నాలుగులో ఎన్నో ప్రయోగాలు చేసాం:

నాలుగులో ఎన్నో ప్రయోగాలు చేసాం:

'పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో నాలుగో స్థానం కోసం చాలా ప్రయోగాలు చేసాం. శ్రేయాస్ అయ్యర్ రూపంలో చివరకు పరిష్కారం దొరికింది. అతడు బాగా ఆడుతున్నాడు. టెస్టుల్లో హనుమా విహారి రాణిస్తున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో చాలా క్రికెట్ ఆడలేదు. ఎంతో కష్టపడి తిరిగి జట్టులోకి వచ్చాడు. ఎప్పుడూ బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు' అని ఎమ్మెస్కే తెలిపాడు.

రాయుడు విషయంలో నేనూ బాధపడ్డా:

రాయుడు విషయంలో నేనూ బాధపడ్డా:

'అంబటి రాయుడు కోసం చాలా ప్రయత్నించా. 2016లో జింబాబ్వే టూర్‌ తర్వాత రాయుడికి టెస్టుల్లో అవకాశమివ్వాలని భావించాం. ఇదే విషయమై.. టెస్టులపై దృష్టి సారించాలంటూ అతనికి వ్యక్తిగతంగానూ సూచించా. ఐపీఎల్‌ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకునే వన్డేలోకి తీసుకున్నాం. చాలామంది అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. ఫిట్‌నెస్‌లో విఫలమవడంతో వరల్డ్‌కప్‌ జట్టు నుండి తప్పించక తప్పలేదు. మెగా ఈవెంట్‌లో అతడిని తీసుకోకపోవడం నన్నూ బాధించింది' అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, February 6, 2020, 16:12 [IST]
Other articles published on Feb 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X