న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ప్రజలు ఏదైనా రాయొచ్చు కానీ.. ధోనీ, కోహ్లీ నన్ను గౌరవిస్తారు'

MSK Prasad said MS Dhoni And Virat Kohli Respect Me, People Might Write Anything

ముంబై: ప్రజలు ఏదైనా రాయొచ్చు కానీ.. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ నన్ను గౌరవిస్తారు అని ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ముంబై మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ధోనీ, కోహ్లీతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు.

<strong>తప్పుడు డోపింగ్‌ ఫలితాలు.. రష్యాపై నాలుగేళ్ల నిషేధం!!</strong>తప్పుడు డోపింగ్‌ ఫలితాలు.. రష్యాపై నాలుగేళ్ల నిషేధం!!

ధోనీ, కోహ్లీ నన్ను గౌరవిస్తారు

ధోనీ, కోహ్లీ నన్ను గౌరవిస్తారు

ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ... 'ఈ పదవీ కాలంలో నేను దిగ్గజ క్రికెటర్ల సలహా తీసుకున్నా. అవి ఎంతగానో ఊయాయోగపడ్డాయి. ధోనీ, కోహ్లీలతో నా అనుబంధం బాగుంది. వారు నాకు అండగా నిలిచారు. ప్రజలు ఏదైనా వ్రాయవచ్చు కానీ.. నేను వారితో మాట్లాడేటప్పుడు వారు నన్ను ఎంతగా గౌరవిస్తారో నాకు తెలుసు. నేను కూడా వారితో అలానే ఉన్నాను' అని తెలిపారు.

ఆంధ్రాలో ఇంతకన్నా ఎక్కువ కష్టాన్ని చూసా:

ఆంధ్రాలో ఇంతకన్నా ఎక్కువ కష్టాన్ని చూసా:

'నేను ఒక మేనేజ్మెంట్ విద్యార్థిని. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో డైరెక్టర్‌గా ఉన్నపుడు ఇక్కడ కంటే చాలా పెద్ద సమస్యలను పరిష్కరించాను. మేము మొదటి నుండి ఆంధ్ర అసోసియేషన్‌ను నిర్మించాం. అనురాగ్ ఠాకూర్ 2015లో ఆంధ్రకు వచ్చినప్పుడు 'ఆదర్శ్ క్రికెట్ అసోసియేషన్' అని పిలిచాడు. బీసీసీఐ పెద్ద బోర్డు. ఇక్కడ పరిణతి చెందిన వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ చాలా కష్టపడ్డాను అని నేను అనుకోను. ఎందుకంటే.. నేను ఆంధ్రాలో ఇంతకన్నా ఎక్కువ కష్టాన్ని చూసా' అని ఎమ్మెస్కే పేర్కొన్నారు.

అతిపెద్ద నిర్ణయం అదే:

అతిపెద్ద నిర్ణయం అదే:

'నేను, ఇండియా-ఎ మేనేజ్మెంట్ మరియు ఇండియన్ మేనేజ్మెంట్ కూర్చుని ఒక ఆటగాడి పురోగతి గురించి చర్చిస్తాం. అందరం సీనియర్ జట్టు యొక్క అవసరాలను పరిశీలిస్తాం. జాతీయ జట్టుకు ఉపయోగపడేలా ఒక ఆటగాడిని తయారు చేస్తాం. నా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం జస్ప్రీత్ బుమ్రాను టెస్టు జట్టులోకి ఎంపిక చేయడం. హార్దిక్ పాండ్యాను టెస్టు జట్టులోకి ఎంపిక చేయడం వెనుక ఓ ప్రణాళిక ఉంది' అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చారు.

Story first published: Wednesday, November 27, 2019, 18:16 [IST]
Other articles published on Nov 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X