న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డేలకు పంత్ ఎంపిక.. దినేశ్ కార్తీక్‌ను తప్పించడం వెనుక: ఎమ్మెస్కే

India vs Westindies : Dhoni's Replacement were Found By Selectors
MSK Prasad Hints All Is Not Over For Dinesh Karthik Despite Omission From ODI Squad

హైదరాబాద్: టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌‌కు మొదటి రెండు వన్డేల్లో చోటివ్వడంతో ఇక దినేశ్ కార్తీక్‌‌కి దారులు మూసుకుపోయినట్లేనని వార్తలు వస్తోన్న నేపథ్యంలో టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు.

హైదరాబాద్ టెస్ట్: సెల్ఫీ కోసం వచ్చి కోహ్లీకి ముద్దివ్వబోయిన అభిమానిహైదరాబాద్ టెస్ట్: సెల్ఫీ కోసం వచ్చి కోహ్లీకి ముద్దివ్వబోయిన అభిమాని

వెస్టిండిస్ జట్టుతో అక్టోబర్ 21వ నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరిస్ కోసం గురువారం సాయంత్రం 14 మందితో కూడిన జట్టుని సెలక్టర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో దినేశ్ కార్తీక్‌పై వేటు వేసిన సెలక్టర్లు.. అతని స్థానంలో ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కి చోటు కల్పించారు.

వికెట్ల వెనకాల ఎంతో చురుకుగా కదులుతున్న ధోని మునుపటిలా పరుగులు చేయలేక పోతుండటంతో ధోని స్థానంలో రిషబ్ పంత్‌కు చోటు దక్కుతుందని అంతా భావించారు. అయితే, దినేశ్‌ కార్తీక్‌ స్థానంలో అతడు జట్టులోకి సెలక్టర్లు ఎంపిక చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

 రెండు మూడు మ్యాచుల్లో విజయాలు

రెండు మూడు మ్యాచుల్లో విజయాలు

ఏడాది కాలంగా టీమిండియా తరఫున దినేశ్‌ కార్తీక్‌ నిలకడగానే రాణించాడు. రెండు మూడు మ్యాచుల్లో విజయాలు అందించాడు. కీలక సమయాల్లో పరుగులు చేస్తున్నాడు. అతడితో వచ్చిన చిక్కల్లా ఏమిటంటే 20, 30 పరుగులను హాఫ్ సెంచరీలు, సెంచరీలుగా మలవలేకపోవడం అని తెలిసింది. దీనిని దృష్టిలో పెట్టుకునే దినేశ్ కార్తీక్ స్థానంలో సెలక్టర్లు రిషబ్ పంత్‌కి చోటు కల్పించారంటూ వార్తలు వస్తున్నాయి.

ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ

ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ "భారత జట్టులో నెంబర్ వన్ వికెట్ కీపర్ ఎవరు? అనేదానిపై మాకు సందేహాల్లేవు. అయితే ఇప్పుడు మా అన్వేషణంతా రెండో (ప్రత్యామ్నాయ) వికెట్ కీపర్ కోసం. ఇప్పటికే ఆ దిశగా దినేశ్ కార్తీక్‌కి అవకాశాలిచ్చాం. తాజాగా రిషబ్ పంత్‌కి ఇస్తున్నాం. సరైన సమయంలో ఇద్దరిలో ఎవరు బెస్ట్? అనేది నిర్ణయిస్తాం. అంతేతప్ప వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌‌ దారులు మూసుకుపోయినట్లు కాదు" అని ఎమ్మెస్కే స్పష్టం చేశారు.

మొదటి రెండు వన్డేలకు జట్టుని ప్రకటించిన సెలక్టర్లు

మొదటి రెండు వన్డేలకు జట్టుని ప్రకటించిన సెలక్టర్లు

వెస్టిండిస్‌తో భారత్ జట్టు మొత్తం ఐదు వన్డేలు ఆడనుండగా.. తొలి రెండు వన్డేలకి మాత్రమే జట్టుని సెలక్టర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి దినేశ్ కార్తీక్‌తో పోలిస్తే రిషబ్ పంత్ అలవోకగా భారీ సిక్సర్లు బాదగలడు. దీంతో పంత్‌ను తీసుకుంటే మ్యాచ్‌లు ముగించగలడు. పంత్ గనుక వన్డేల్లో క్లిక్ అయితే, ధోని తర్వాత టీమిండియా మరో ఫినిషర్ దొరికినట్లేనని జట్టు యాజమాన్యం భావిస్తోంది. వచ్చే ఏడాది దృష్ట్యా మిడిలార్డర్‌లో పంత్‌ కుదురుకుంటే జట్టు కూర్పులో ఇబ్బందులు ఉండవు.

 మొదటి రెండు వన్డేలకు వన్డే జట్టు

మొదటి రెండు వన్డేలకు వన్డే జట్టు

జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, మనీశ్ పాండే, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్, శార్ధూల్ ఠాకూర్, కేఎల్ రాహుల్

Story first published: Friday, October 12, 2018, 14:05 [IST]
Other articles published on Oct 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X