న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ ఆధ్వర్యంలో సచిన్‌, లక్ష్మణ్‌ ప్రాక్టీస్‌...

MS Dhoni Watches On As Sachin Tendulkar Bowls Bouncers To VVS Laxman ! || Oneindia Telugu
MS Dhoni Watches On As Sachin Tendulkar Bowls Bouncers To VVS Laxman In Throwback Video

భారత జట్టులో మహేంద్రసింగ్ ధోనీ పేరు వినగానే మొదటగా గుర్తొచ్చేది 'కూల్ కెప్టెన్సీ'. ఈ కూల్ కెప్టెన్సీతోనే టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించాడు. వీటితో పాటు మూడు ఐసీసీ టోర్నీలను కూడా టీమిండియాకు అందించాడు. ఇక ధోనీ సారథ్యంలోనే ఎన్నో చిరస్మరణీయ విజయాలను టీమిండియా అందుకుని వన్డే, టెస్టులలో మొదటి స్థానాలకు చేరుకుంది. అయితే మైదానంలో తనకు కావాల్సిన ప్రదర్శనను ఆటగాళ్లను నుంచి రాబట్టుకోవడంతోనే ఇదంతా సాధ్యమయింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

నెట్టింట్లో వీడియో:

మ్యాచ్‌లనే కాకుండా ప్రాక్టీస్‌లోనూ ఆటగాళ్ల ప్రదర్శనను ఎంఎస్ ధోనీ పరిశిలిస్తాడు. ఏదైనా లోపాలుంటే.. అది జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా సూచనలిస్తాడు. తాజాగా ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను ధోనీ పరిశీలిస్తున్న వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమయింది. ఈ వీడియోను టీమిండియా మాజీ మానసిక నిపుణుడు ప్యాడీ ఆప్టన్‌ షేర్‌ చేసాడు.

ధోనీ కనుసన్నల్లో ప్రాక్టీస్‌:

ధోనీ కనుసన్నల్లో ప్రాక్టీస్‌:

భారత మాజీ దిగ్గజాలు సచిన్‌, లక్ష్మణ్‌లు ప్రాక్టీస్‌ చేస్తుంటే.. పక్కనే కూర్చొని ధోనీ పరిశీలిస్తున్నాడు. 2008లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా లక్ష్మణ్‌ పూర్తిగా విఫలమవుతున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లు విసిరే బౌన్సర్లలకు లక్ష్మణ్‌ తెగ ఇబ్బంది పడ్డాడు. దీంతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో సచిన్‌తో ప్రత్యేకంగా బౌన్సర్లను వేపించుకుని లక్ష్మణ్‌ ప్రాక్టీస్‌ చేస్తాడు. ఈ ప్రాక్టీస్‌ను ధోనీ దగ్గరుండి మరీ పరిశీలించాడు. దీనికి సంబందించిన వీడియోను ఆప్టన్‌ తన ట్విట్టర్లో షేర్‌ చేశాడు.

ధోనీ దిట్ట:

ధోనీ దిట్ట:

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. నెటిజన్లు తమదైన కామెంట్లతో హల్చల్ చేస్తున్నారు. 'దిగ్గజాలు సచిన్‌, లక్ష్మణ్‌లు కూడా ధోనీ ఆధ్వర్యంలోనే ప్రాక్టీస్‌ చేస్తున్నారు' అని ఓ అభిమాని కామెంట్‌ చేసాడు. 'ప్రతిభ రాబట్టడంలో ధోనీ దిట్ట' అని మరో అభిమాని కామెంట్ చేసాడు. మే 30 నుండి ప్రారంభం కానున్న ప్రపంచకప్‌లో కూడా ధోనీ సూచనలు కీలకం కానున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అండగా నిలవనున్నాడు.


Story first published: Saturday, May 18, 2019, 12:08 [IST]
Other articles published on May 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X