'ధోనీ.. కోహ్లీని జట్టులోకి తీసుకోవద్దని చెప్పాడు'

Posted By:
MS Dhoni was against Virat Kohli's inclusion in 2008, Dilip Vengsarkar's blast from the past

హైదరాబాద్: ధోనీ నుంచే కెప్టెన్సీ అందుకున్న కోహ్లీ అతని సలహాలు, సూచనలు తీసుకుంటూనే జట్టును నడిపిస్తున్నాడు. కానీ, ఒకప్పుడు విరాట్‌ కోహ్లీని జట్టులోకి తీసుకుందాం అంటే ధోనీ ఒప్పుకోలేదట. 'కోహ్లీని తీసుకుందాం' అనే నిర్ణయాన్ని బయటపెట్టినందుకు బీసీసీఐ కోశాధికారిగా ఉన్న శ్రీనివాసన్‌ సెలక్టర్‌ పదవిలో ఉన్న వెంగ్‌సర్కార్‌ని ముందుగానే తప్పించాడట.

ఈ విషయాలన్నింటినీ బీసీసీఐ మాజీ సెలక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ ఇటీవల చెప్పుకొచ్చారు. ముంబైలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న వెంగ్‌సర్కార్‌ తన అనుభవాలను ఇలా పంచుకున్నాడు. 2008లో టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లాల్సిన సమయంలో జరిగిన సంఘటన అది. అండర్‌-23లో ఆడే ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని సెలక్షన్‌ కమిటీ నిర్ణయించుకుందట. దానిలోనే జరిగింది అసలు విషయం.

 నిర్ణయాన్ని సెలక్టర్ల ముందుంచా:

నిర్ణయాన్ని సెలక్టర్ల ముందుంచా:

'అదే ఏడాది కోహ్లీ నాయకత్వంలోని అండర్‌-19 భారత జట్టు ప్రపంచకప్‌ గెలిచింది. ఆ తర్వాత ఇండియా-ఎ తరఫున బ్రిస్బేన్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో కోహ్లీ 123 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌ చూసిన నేను అతనికి లంక పర్యటనకు వెళ్లే భారత జట్టులో స్థానం కల్పించాలనుకున్నా‌. నా నిర్ణయాన్ని సహ సెలక్టర్ల ముందు ఉంచా. వారంతా అంగీకరించారు. అప్పుడు కోచ్‌గా ఉన్న గ్యారీ కిర్‌స్టన్‌, కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ మాత్రం ఒప్పుకోలేదు' అని వెంగ్ సర్కార్ అప్పటి సంగతులు చెప్పుకొచ్చాడు.

అప్పటికే కోహ్లీ ఆట తీరు చూశా:

అప్పటికే కోహ్లీ ఆట తీరు చూశా:

కోహ్లీని తీసుకోమని సూచించిన ఆయన అప్పటికే కోహ్లీ ఆట తీరు చూశాడట. అందుకే జట్టులో సరిపోతాడని స్థానం ఇవ్వాలనుకున్నానని పేర్కొన్నాడు. కానీ, వారు ఎందుకు ఒప్పుకోలేదని, ఒక వేళ వారు ఒప్పుకుంటే చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు బద్రీనాథ్‌పై వేటు పడుతుందేమోనని భయంతో అలా చేసుంటారని వివరించాడు.

 అందుకే తీసుకోవాలన్నా:

అందుకే తీసుకోవాలన్నా:

ఇంకా మాట్లాడుతూ.. ‘అంతేకాదు అప్పుడు బీసీసీఐ కోశాధికారిగా పని చేస్తున్న శ్రీనివాసన్‌కు నా నిర్ణయం నచ్చలేదు. ఆ తర్వాత బద్రీనాథ్‌పై ఎందుకు వేటు వేయాలనుకుంటున్నావ్‌ అని ఆయనే వచ్చి అడిగాడు. ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్‌ ప్రదర్శన చూశాను. అందుకే తీసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పా.'

 నాతో వాదించాడు:

నాతో వాదించాడు:

అంతకు ముందు జరిగిన ఓ టోర్నీలో తమిళనాడు తరఫున బరిలోకి దిగిన బద్రీనాథ్‌ 800 పరుగులు చేశాడు. మరి అతనికి ఎందుకు స్థానం ఇవ్వకూడదు అని నాతో వాదించాడు. తర్వాత ఛాన్స్‌ ఇస్తానన్నా. ‘ఇంకా ఎప్పుడు ఛాన్స్‌ ఇస్తావు? ఇప్పటికే అతడి వయస్సు 29' అన్నాడు.

 కాల పరిమితి ముగిసిందని:

కాల పరిమితి ముగిసిందని:

ఎప్పుడిస్తానో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేను. కానీ తప్పకుండా బద్రీనాథ్‌కు అవకాశం మాత్రం ఇస్తా అని బదులిచ్చా. ఏమైందో ఏమో తెలియదు. ఆ మరుసటి రోజే శ్రీకాంత్‌ను తీసుకొచ్చి సెలక్టర్‌గా నియమించి నా కాల పరిమితి ముగిసిందని చెప్పారు' అని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు.

Story first published: Thursday, March 8, 2018, 14:49 [IST]
Other articles published on Mar 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి