న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'బౌలర్లకంటే మెరుగ్గా.. వికెట్ల వెనుక ధోని ఉంటే మా పని సులువు'

ICC World Cup 2019 : MS Dhoni Understands Match Situations Better Than Bowlers Says Kuldeep Yadav
MS Dhoni understands match situations better than bowlers, says Kuldeep Yadav

హైదరాబాద్: మ్యాచ్‌ పరిస్థితులను బౌలర్ల కన్నా ధోనీయే మెరుగ్గా అంచనా వేస్తాడని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్‌ అన్నాడు. వికెట్ల వెనుకాల ధోని ఉండటం వల్ల తమ పని చాలా సులువు అవుతుందని పేర్కొన్నాడు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో కుల్దీప్ మాట్లాడుతూ "ధోనితో కలిసి ఆడటం నా అదృష్టం. మమ్మల్ని అతడే నడిపిస్తాడు. మార్పు చేయాలని భావిస్తే కచ్చితంగా చెప్పేస్తాడు. వికెట్‌ కీపర్‌ అలా సహకరిస్తుంటే పని తేలిక అవుతుంది" అని అన్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ధోని అంచనా కచ్చితంగా నిజమవుతుంది

ధోని అంచనా కచ్చితంగా నిజమవుతుంది

"చాలాసార్లు బౌలర్లు మ్యాచ్‌ పరిస్థితులను సరిగా అంచనా వేయలేరు. వికెట్‌ కీపర్‌ ధోని అంచనా కచ్చితంగా నిజమవుతుంది. మహీ భాయ్‌కు చాలా అనుభవం ఉంది. నాకు ఏమైనా తెలియకపోయినా ధోనిని అడుగుతుంటా. ధోనితో కలిసి ఆడుతున్నందుకు చాహల్‌, నేను అదృష్టంగా భావిస్తుంటాం. వికెట్ల వెనకాల మహీభాయ్‌ ఉంటే బౌలింగ్‌ సులభం అవుతుంది" అని కుల్దీప్ చెప్పాడు.

ఇంగ్లాండ్, పాకిస్థాన్ నుంచి పోటీ తప్పదు

ఇంగ్లాండ్, పాకిస్థాన్ నుంచి పోటీ తప్పదు

ప్రపంచకప్‌ను భారత్‌కు తీసుకొచ్చే అవకాశం కోహ్లీసేనకు ఉందని కుల్దీప్‌ ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ గెలిచే అవకాశాలు భారత్‌కు మెరుగ్గానే ఉన్నా.. ఇంగ్లాండ్, పాకిస్థాన్ నుంచి పోటీ తప్పదని అన్నాడు. ఇతర జట్లతో పోలిస్తే మాత్రం ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ లైనప్ భీకరంగా ఉందన్నాడు. వారు స్వదేశంలో ఆడుతున్న సంగతి గుర్తుంచుకోవాలని అన్నాడు.

టీమిండియా పేస్ అటాక్ చాలా అద్భుతంగా ఉంది

టీమిండియా పేస్ అటాక్ చాలా అద్భుతంగా ఉంది

పాకిస్థాన్‌ సైతం బాగా ఆడే అవకాశం ఉందని అన్నాడు. ప్రస్తుతం టీమిండియా పేస్ అటాక్ చాలా అద్భుతంగా ఉందని కుల్దీప్ ప్రశంసించాడు. కెప్టెన్ విరాట్‌ కోహ్లీ బౌలర్లను నిత్యం ప్రోత్సహిస్తూనే ఉంటాడని కుల్దీప్ తెలిపాడు.

Story first published: Thursday, March 21, 2019, 13:15 [IST]
Other articles published on Mar 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X