న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీనా మజాకానా.. రైతుగా సూపర్ క్రేజ్.. అతని పంట దుబాయ్‌కి ఎగుమతి!

MS Dhoni to send vegetables from his farmhouse to Dubai

రాంచీ (జార్ఖండ్‌): అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. వ్యవసాయంలో బిజీ అయ్యాడు. గతంలో మహీ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే, తాజాగా ధోనీ ఫామ్‌లో పండిన కూరగాయలను దుబాయ్‌కు ఎగుమతి చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. వీటిని గల్ఫ్‌లో మార్కెట్‌ చేసేందుకు ఫామ్‌ ఫ్రెష్‌ ఏజెన్సీతో జార్ఖండ్‌ వ్యవసాయ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. త్వరలో ఒప్పందం కూడా ఖరారు కానున్నట్టు తెలిపింది.

రాంచీ శివార్లలోని శంబో గ్రామంలోని మహీ 43 ఎకరాల ఫామ్‌ హౌస్‌లో 10 ఎకరాల్లో టమోటా, క్యాబేజీ, బొప్పాయి, ఇతర పంటలను పండిస్తున్నాడు. ఆర్గానిక్ పద్దతిలో పడిస్తుండటంతో ధోనీ ఫామ్‌ కూరగాయలకు స్థానికంగా మంచి డిమాండ్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

'కొత్త ప్రాజెక్ట్‌ కింద ధోనీ పండించిన కూరగాయలను ఫామ్‌ ఫ్రెష్‌ ఏజెన్సీ ఎగుమతి చేయనుంది. ధోనీ జార్ఖండ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్. అతని పేరిట కూరగాయలను విదేశాలకు పంపించడం వల్ల జార్ఖండ్ రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది.'అని రాంచీ మార్కెటింగ్ కమిటీ అధిపతి అభిషేక్ ఆనంద్ తెలిపారు.

గతేడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మహీ.. లాక్‌డౌన్ సెంద్రీయ వ్యవసాయం చేస్తూ కనిపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఐపీఎల్ ఆడినా.. తన ఖాళీ సమయాన్ని వ్యవసాయానికే కేటాయించాడు. ధోనీ రైతుగా మారి పొలం పనులు చేసిన ఫొటోలు నెట్టింట్ల వైరల్ అయ్యాయి.

ఇటీవల కాలంలో సెలబ్రిటీలు వ్యవసాయం చేయడం పరిపాటిగా మారిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌లో షూటింగ్‌లు వాయిదా పడటంతో బాలీవుడ్‌, టాలీవుడ్, కోలివుడ్ హీరోలు తమ ఫాం హౌస్‌ల్లో సేంద్రియా వ్యవసాయం చేస్తున్నారు.

Story first published: Sunday, January 3, 2021, 19:28 [IST]
Other articles published on Jan 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X