న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందరికంటే ముందుగానే దుబాయ్‌కి సీఎస్‌కే.. మిడ్ ఆగస్టులో ట్రైనింగ్ షురూ!

MS Dhoni Team look to begin IPL 2020 camp in Dubai by mid-August

న్యూఢిల్లీ: దుబాయ్ వేదికగా ఈ ఏడాది జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌)కు ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ అనుమతితో పాటు బీసీసీఐ ఆదేశాలు వచ్చిన వెంటనే టీమ్‌ను దుబాయ్ పంపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈ విషయంలో అందరికంటే ఓ అడుగు ముందుంది. ఆగస్టు 12వ తేదీలోపు దుబాయ్ వెళ్లాలని చెన్నై జట్టు భావిస్తోంది.

చార్టెడ్ ఫ్లైట్‌లో..

చార్టెడ్ ఫ్లైట్‌లో..

ఆగస్టు 15లోపే ట్రైనింగ్ క్యాంప్ స్టార్ట్ చేయాలనేది సీఎస్‌కే ఆలోచన..‘ఆగస్టు 8 కల్లా మొత్తం జట్టును దుబాయ్ చేర్చాలని ప్లాన్ చేస్తున్నాం. అలాగైతేనే మేము అదే నెల రెండో వారం చివర్లో ట్రైనింగ్ క్యాంప్ మొదలుపెట్టగలం. బీసీసీఐ నుంచి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ) అందిన వెంటనే ట్రావెల్ ప్లాన్‌ను ఫైనల్ చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా టీమ్‌ను చార్టెడ్ ఫ్లైట్‌లోనే దుబాయ్ తీసుకెళ్లాలని భావిస్తున్నాం.'అని సీఎస్‌కే అధికారి ఒకరు పేర్కొన్నారు.

సెప్టెంబర్ తొలి వారంలో..

సెప్టెంబర్ తొలి వారంలో..

మిగిలిన ఫ్రాంచైజీలు కూడా దుబాయ్‌లో ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించాలని చూస్తున్నాయి. సెప్టెంబర్ తొలి వారంలో దాదాపు అన్ని జట్లు ట్రైనింగ్ షురూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ 13వ ఎడిషన్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. దీంతో అంతకన్నా ముందే దుబాయ్ చేరుకొని మూడు వారాలా ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించాలని భావిస్తున్నాయి. ఆ దిశగా ప్రణాళికలు రచిస్తున్నాయి.

వచ్చే ఆదివారం క్లారిటీ..

వచ్చే ఆదివారం క్లారిటీ..

ఇక ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్‌పై వచ్చే ఆదివారం జరిగే జనరల్ కౌన్సిల్ మీటింగ్‌లో క్లారిటీ రానుంది. ఫ్రాంచైజీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్‌ఓపీ కూడా అందజేయనుంది.

క్రికెటర్ల సతీమణులు అనుమతిపై, హోటళ్ల ,సెక్యూరిటీ, బస్ డ్రైవర్ల వ్యవహారంపై చర్చించనుంది.

‘నాడా' నజర్‌!

‘నాడా' నజర్‌!

గత డిసెంబరులో బీసీసీఐ కూడా జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) పరిధిలోకి వచ్చింది. దాంతో యూఏఈలో ప్రారంభమయ్యే ఐపీఎల్‌పై తొలిసారి నాడా దృష్టి సారించనుంది. లీగ్‌ సందర్భంగా క్రికెటర్లనుంచి నమూనాలను ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా సేకరించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో యూఏఈ జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడో) లేదా స్వీడన్‌కు చెందిన ఇంటర్నేషనల్‌ డోప్‌ టెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఐడీటీఎం)లలో ఒకదానికి ఆ బాధ్యతలు అప్పగించాలనుకుంటోంది. అయితే ఐడీటీఎం సంస్థ గత 12 సీజన్లుగా ఐపీఎల్‌లో ఆటగాళ్ల నమూనాలను సేకరిస్తోంది.

Story first published: Thursday, July 30, 2020, 9:52 [IST]
Other articles published on Jul 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X