న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంపైర్లతో వివాదం: ధోనీపై రెండు మ్యాచ్‌ల నిషేధం వేయాల్సింది

IPL 2019 : Sehwag Said MS Dhoni should Have Been Disallow For 1 or 2 Matches || Oneindia Telugu
MS Dhoni Should Have Been Banned For 2-3 Games says Virender Sehwag

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీకి తక్కువ శిక్షతో సరిపెట్టారని టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించి డగౌట్ నుండి నేరుగా మైదానంలోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగిన ధోనీపై కనీసం రెండు లేదా మూడు మ్యాచ్‌ల నిషేధం విధించాల్సి ఉండేదని సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు.

నోబాల్‌ వివాదం:

నోబాల్‌ వివాదం:

గురువారం రాజస్తాన్‌తో చెన్నై మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ నాలుగో బంతిని స్టోక్స్‌.. శాంట్నర్‌కు నడుంపైకి వేసాడు. దీంతో ప్రధాన అంపైర్‌ హైట్‌ నోబాల్‌గా ప్రకటించాడు. అయితే లెగ్‌ అంపైర్‌ కాదనడంతో.. ప్రధాన అంపైర్‌ వెంటనే చేతిని దించేశాడు. ఈ ఘటనతో కెప్టెన్ ధోనీ ఆవేశంగా మైదానంలోకి దూసుకొచ్చి అంపైర్లతో వాదనకు దిగాడు. దీంతో ధోనీపై చాలా విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై సెహ్వాగ్‌ స్పందించారు.

మిగతా క్రికెటర్లకు హెచ్చరికలా ఉండేది:

మిగతా క్రికెటర్లకు హెచ్చరికలా ఉండేది:

'ధోనీకి తక్కువ శిక్షతో సరిపెట్టారు. ధోనీపై కనీసం రెండు లేదా మూడు మ్యాచ్‌ల నిషేధం విధించాల్సింది. మున్ముందు మరో కెప్టెన్‌ అలాగే చేసే అవకాశముంది, అలా చేస్తే అంపైర్‌కు ఇచ్చే విలువ ఏముంటుంది?. ధోనీపై మ్యాచ్‌ల నిషేధం విధిస్తే.. మిగతా క్రికెటర్లకు హెచ్చరికలా ఉండేది' అని సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు.

ధోనీకి కోపం రావడం ఎప్పుడూ చూడలేదు:

ధోనీకి కోపం రావడం ఎప్పుడూ చూడలేదు:

'క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్‌ నోబాల్‌ గురించి అడిగేవాళ్లు కదా. ధోనీ డగౌట్ నుండి నేరుగా మైదానంలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది. ధోనీ టీమిండియా కోసం ఇలా చేస్తే సంతోషంగా ఉండేవాడిని. భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నపుడు అతనికి కోపం రావడం ఎప్పుడూ చూడలేదు. ఈ ఘటనను చూస్తే.. చెన్నై జట్టు పట్ల ధోనీ భావోద్వేగాలు కలిగి ఉన్నాడని అర్థమవుతోంది' అని సెహ్వాగ్‌ చెప్పుకొచ్చారు.

ధోనీకి గంగూలీ మద్దతు:

ధోనీకి గంగూలీ మద్దతు:

ధోనీకి భారత మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ మద్దుతుగా నిలిచాడు. ధోనీ కూడా ఓ మనిషే. మనుషులు అన్నాక కోపం రావడం సహజం. ఆ సమయంలో ధోనీ కూడా సహనం కోల్పోయాడు. ధోనీలోని పోటీతత్వాన్ని చూడాలని గంగూలీ అన్నాడు.

Story first published: Sunday, April 14, 2019, 16:44 [IST]
Other articles published on Apr 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X