న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డర్బన్‌లో తొలి వన్డే: నెట్స్‌లో ధోని ప్రాక్టీస్, ఫ్యాన్స్‌తో రోహిత్ సెల్ఫీలు

By Nageshwara Rao
MS Dhoni Sends Out Warning to Faf du Plessis and Boys

హైదరాబాద్: ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య డర్బన్ వేదికగా తొలి వన్డే గురువారం (ఫిబ్రవరి 1)న జరగనుంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 1-2తో చేజార్చుకున్న కోహ్లీసేన ఇప్పుడు వన్డే సిరిస్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా బుధవారం భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా కసరత్తులు చేశారు.

సఫారీ జట్టు ఆ ఇద్దరి దగ్గర జాగ్రత్త పడాల్సిందే: డుప్లెసిస్సఫారీ జట్టు ఆ ఇద్దరి దగ్గర జాగ్రత్త పడాల్సిందే: డుప్లెసిస్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. ప్రాక్టీస్ అనంతరం వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ అభిమానులతో ఫొటోలు దిగుతూ సందడి చేశాడు.

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన మూడో టెస్టులో కోహ్లీసేన విజయం సాధించడంతో కోహ్లీసేన వన్డే సిరిస్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. సఫారీ గడ్డపై టీమిండియా ఇప్పటివరకు ఒక్క ద్వైపాక్షిక సిరిస్‌ను కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో ఈ వన్డే సిరిస్‌ను కోహ్లీసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

వరల్డ్ కప్‌కు కోర్ ప్లేయర్లు రెడీ, ఆ ఒక్క స్లాట్ మాత్రమే మిగిలింది: కోహ్లీవరల్డ్ కప్‌కు కోర్ ప్లేయర్లు రెడీ, ఆ ఒక్క స్లాట్ మాత్రమే మిగిలింది: కోహ్లీ

మరోవైపు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ తొలి మూడు వన్డేలకు దూరం కావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. మరోవైపు ధోని వన్డేల్లో పదివేల పరుగులు పూర్తి చేయడానికి ఇంకా 102 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ సిరీస్‌ ద్వారా ధోని వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

వన్డే సిరిస్ షెడ్యూల్:

1st ODI: Feb 01, 2018, Thursday @ Kingsmead, Durban
05:00 PM (IST)

2nd ODI: Feb 04, 2018, Sunday @ Supersport Park, Centurion
01:30 PM (IST)

3rd ODI: Feb 07, 2018, Wednesday @ Newlands, Cape Town
05:00 PM (IST)

4th ODI: Feb 10, 2018, Saturday @ New Wanderers Stadium, Johannesburg
05:00 PM (IST)

5th ODI: Feb 13, 2018, Tuesday @ St George's Park, Port Elizabeth
05:00 PM (IST)

6th ODI: Feb 16, 2018, Friday @ Supersport Park, Centurion
05:00 PM (IST)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, February 1, 2018, 13:26 [IST]
Other articles published on Feb 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X