న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'వారితో డ్రెస్సింగ్‌ రూమ్ పంచుకోవడం గర్వంగా భావిస్తున్నాం'

Dhoni's Inputs Big Plus For Kuldeep And Me : Yuzvendra Chahal || Oneindia Telugu
MS Dhonis inputs big plus for Kuldeep Yadav and me: Yuzvendra Chahal

హైదరాబాద్: మార్చి 26, 2015 సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో టీమిండియా 95 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత సరిగ్గా 15 నెలలు తర్వాత జూన్ 11, 2016న హర్యానాకు చెందిన ఓ యువ చైనామన్ స్పిన్నర్ జింబాబ్వేపై భారత్ తరుపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అతడి పేరు యజువేంద్ర చాహల్.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

తన తొలి మ్యాచ్‌లో రాణించలేకపోయినా... ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 6/25 గణాంకాలను నమోదు చేసి భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆ తర్వాత అనేక మ్యాచ్‌ల్లో భారత్ జట్టుకు విజయాలనందించాడు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో చాహల్ చోటు దక్కించుకున్నాడు.

కేవలం బౌలింగ్‌ మీదే కాకుండా బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లోనూ మెరుగుపడేందుకు నెట్స్‌లో సాధన చేస్తున్నానని పేర్కొన్నాడు. తాజాగా చాహల్ మాట్లాడుతూ "పిచ్‌ను పూర్తిగా చదివే తెలివి ధోనీకి ఉంది. ఆ విషయంలో ధోని ఇచ్చే సూచనలు ఎంతో ఉపయోగపడతాయి. క్లిష్ట సమయాల్లో ధోని భాయ్‌ ఎన్నోసార్లు మద్దతుగా నిలిచాడు" అని తెలిపాడు.

"ధోనీతో పాటు కోహ్లీ, రోహిత్‌శర్మ కూడా మాకు ఎంతగానో తోడ్పాటునందిస్తుంటారు. మా జట్టులో ఎవరికి వారే కెప్టెన్‌. ఎవరూ ఎవరిపైనా అజమాయిషీ చెలాయించరు. అందుకే ఇప్పుడు భారత జట్టుతో డ్రెస్సింగ్‌ రూమ్ పంచుకోవడం ఎంతో గర్వంగా భావిస్తున్నాం" అని చాహల్ పేర్కొన్నాడు.

ప్రస్తుతం టీమిండియా చాలా బలంగా ఉందని చెప్పిన చహల్‌.. కోహ్లీ, ధోనిలు జట్టులో వున్నంత కాలం ఇదే నెంబర్ వన్ జట్టేనని అన్నాడు. ధావన్, రోహిత్‌ల రూపంలో మంచి ఓపెనింగ్ జోడీ ఉందని... ధోని, రాహుల్‌, పాండ్యాలతో మిడిలార్డర్‌ బలంగా దుర్బేద్యంగా ఉందని చెప్పుకొచ్చాడు.

ఇక టీమిండియా బౌలింగ్ విభాగానికి వస్తే షమీ, బుమ్రా, భువనేశ్వర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారని అన్నాడు. భారత జట్టుతో పాటు ఆతిథ్య ఇంగ్లాడ్ జట్టు కూడా ఈసారి హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోందని చాహాల్ చెప్పుకొచ్చాడు. సొంతగడ్డపై ఈ ప్రపంచ కప్ టోర్నీ జరగడం వారికి కలిసొచ్చే అంశమని అన్నాడు.

అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు కూడా బలంగా ఉన్నాయని మొత్తానికి ఈసారి ఫోటీ గట్టిగానే పోటీ ఉండే అవకాశం ఉందని చెప్పాడు. ఎంత బలమైన జట్టునయినా ఎదురించి గెలిచే సత్తా టీమిండియాకు ఉందని, ఈ వరల్డ్‌కప్ టీమిండియాదేనని చాహల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, May 17, 2019, 17:33 [IST]
Other articles published on May 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X