న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని సలహా వల్లే రిషబ్ పంత్ షాట్ల ఎంపికలో తేడా: భజ్జీ

MS Dhonis helped Rishabh Pant bat well in Auckland: Harbhajan Singh

హైదరాబాద్: ఆక్లాండ్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పంత్ 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. పంత్ దూకుడుగా ఆడటం వల్లే టీమిండియా ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా విజయాన్ని అందుకుందని టీమిండియా వెటరన్ స్ఫిన్నర్ హర్భజన్ సింగ్ ప‍్రశంసల వర్షం కురిపించాడు.

<strong>చాంపియన్‌ సాంగ్‌కు మించి ఉంది: కోహ్లీ, ధోనిపై బ్రావో పాట(వీడియో)</strong>చాంపియన్‌ సాంగ్‌కు మించి ఉంది: కోహ్లీ, ధోనిపై బ్రావో పాట(వీడియో)

పంత్ ఆడిన తీరు

పంత్ ఆడిన తీరు

కివీస్‌తో మ్యాచ్‌లో పంత్ ఆడిన తీరు అతడిని వరల్డ్‌కప్‌ రేసులో కచ‍్చితంగా నిలుపుతుందని భజ్జీ అన్నాడు. అయితే, పంత్ ఇన్నింగ్స్‌కు ధోనినే కారణమని హర్భజన్ అన్నాడు. ఈ సందర్భంగా భజ్జీ మాట్లాడుతూ "పంత్ షాట్లను ఆడే సమయంలో ధోని సలహా ఎంతగానో ఉపకరించింది. ముందు రిషబ్ చాలా సాధారణమైన షాట్లు ఆడాడు" అని భజ్జీ వెల్లడించాడు.

ధోని షాట్ల ఎంపికలో కొన్ని సూచనలు

ధోని షాట్ల ఎంపికలో కొన్ని సూచనలు

"ఆ సమయంలో అతని వద్దకు వెళ్లిన ధోని షాట్ల ఎంపికలో కొన్ని సూచనలు చేశాడు. ప్రధానంగా జట్టుకు రిషభ్ అవసరాన్ని గుర్తు చేశాడు. అటు తర్వాత రిషబ్ తన బ్యాటింగ్‌ శైలిని మార్చాడు. ఎటువంటి ప్రమాదం లేని షాట్లను ఆడాడు. ప్రధానంగా గ్రౌండ్‌ షాట్లను ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు" అని హర్భజన్ తెలిపాడు.

ఏ బంతిని హిట్‌ చేయాలో

ఏ బంతిని హిట్‌ చేయాలో

"ఏ బంతిని హిట్‌ చేయాలో దాన్ని మాత్రమే బౌండరీ అవతలకు తరలించాడు. ఇక్కడ పంత్‌కు ధోని సూచన చాలా ఎక్కువగా ఉపయోగపడింది" అని భజ్జీ తెలిపాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా మూడో టీ20 ఆదివారం జరగనుంది. మూడో టీ20కి భారత జట్టులో ఒక మార్పు జరిగే అవకాశముంది.

మూడో టీ20లో కుల్దీప్ యాదవ్

మూడో టీ20లో కుల్దీప్ యాదవ్

కింది వరుసలో వచ్చే కృనాల్‌ పాండ్యా కూడా బ్యాటింగ్‌ చేయగలడు కాబట్టి ఒక బ్యాట్స్‌మన్‌ను తగ్గించుకుని స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను ఆడించాలని భారత్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వన్డే సిరీస్‌లో సత్తా చాటిన కుల్దీప్‌కు టీ20 సిరీస్‌లో అవకాశం రాలేదు. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ స్పిన్‌కే ఎక్కువ ఇబ్బంది పడుతుండటంతో కుల్దీప్‌ను కూడా ఆడిస్తే ప్రయోజనముంటుందని భావిస్తున్నారు.

Story first published: Sunday, February 10, 2019, 10:14 [IST]
Other articles published on Feb 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X