'ముమ్మాటికీ... ధోని లాంటి మరో ఆటగాడిని తయారు చేయలేను'

Posted By:

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని... అంతర్జాతీయ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు. బీసీసీఐ భారత జట్టుకు అందించిన అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడు. అంతేనా... భారత్‌కు ఐసీసీ నిర్వహించే మూడు వరల్డ్ ట్రోఫీలను అందించిన ఏకైక కెప్టెన్. అంతేకాదు ఎంతోమంది యువ క్రికెటర్లకు ధోని ఆదర్శవంతంగా నిలిచాడు.

ఎంతమంది తన దగ్గర శిక్షణ పొందినా ధోని లాంటి మరో ఆటగాడిని మాత్రం తయారు చేయలేనని అతడి చిన్ననాటి కోచ్ కేశవ్ రంజన్ బెనర్జీ చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కేశవ్ బెనర్జీ మాట్లాడుతూ తమ కుమారుడ్ని ధోనీలాగా తయారు చేయాలని ఎంతో మంది తల్లిదండ్రులు ప్రతి రోజూ తనని కలుస్తారని అన్నాడు.

ధోనిలాంటి ఆటగాడిని మాత్రం తయారు చేయలేను

ధోనిలాంటి ఆటగాడిని మాత్రం తయారు చేయలేను

అయితే ధోనికి స్వతహాగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, తానేమీ మ్యాజిక్‌ చేయలేనని చెప్పాడు. అయితే, తాను ఒక్కటి మాత్రం చెప్పగలనని, ధోనిలాంటి ఆటగాడిని మాత్రం తయారు చేయలేనని స్పష్టం చేశాడు. 'మొదట్లో 8, 9, 10 తరగతుల విద్యార్థులు మాత్రమే క్రికెట్‌ నేర్చుకునేందుకు వచ్చేవారు. కానీ, ఇప్పుడు ఆరో తరగతి వారు కూడా వస్తున్నారు' అని అన్నాడు.

ధోని లాంటి ఆటగాళ్లు దొరకడం కష్టం

ధోని లాంటి ఆటగాళ్లు దొరకడం కష్టం

'దీనివల్ల ఆటగాళ్లను ఎంచుకునేందుకు నాకు సులువుగా ఉంది. ధోని లాంటి ఆటగాళ్లు దొరకడం కష్టం. ప్రస్తుతం నా దగ్గర శిక్షణ పొందేవాళ్లు చాలా ప్రతిభావంతులు. ఎంతో కష్టపడతారు' అని బెనర్జీ చెప్పుకొచ్చాడు. ధోని స్వస్థలం రాంచీ అన్న సంగతి తెలసిందే. రాంచీలోని డీఏవీ జవహార్‌ విద్యా మందిర్‌లోనే ధోని స్కూలింగ్ పూర్తి చేశాడు.

ధోనినిని స్ఫూర్తిగా తీసుకుని క్రికెట్‌‌ని

ధోనినిని స్ఫూర్తిగా తీసుకుని క్రికెట్‌‌ని

ఇప్పుడు ఆ స్కూలు విద్యార్ధులు చాలా మంది ధోనిని స్ఫూర్తిగా తీసుకుని క్రికెట్‌‌ని ఎంచుకుంటున్నారు. 'ఏడాదిన్నర క్రితం జేఎస్‌సీఏ ఇండోర్‌ స్టేడియంలో ధోనిని కలిశాను. అప్పుడు అతడు నాకు ఒకటే చెప్పాడు. 'కష్టపడు... కలలను సాకారం చేసుకో' అని వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తోన్న విద్యార్థి రామ్‌ రోషన్‌ చెప్పాడు.

క్రికెటర్‌గా రాణించి విజయానికి కొత్త అర్థం చెప్పిన ధోని

క్రికెటర్‌గా రాణించి విజయానికి కొత్త అర్థం చెప్పిన ధోని

'మొదట్లో గ్రామాల నుంచి వచ్చిన వారు క్రికెట్‌ ఆడేందుకు సిగ్గుపడుతూ ఉండేవారు. చిన్న పట్టణం, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ధోని క్రికెటర్‌గా రాణించి విజయానికి కొత్త అర్థం చెప్పాడు. దీంతో చాలా మంది ఎలాంటి సవాళ్లైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు' అని ఆల్‌రౌండర్‌గా రాణిస్తోన్న పన్నెండవ తరగతి విద్యార్థి కుమార్‌ శివం చెప్పాడు.

Story first published: Wednesday, October 11, 2017, 15:32 [IST]
Other articles published on Oct 11, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి