న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2011 వరల్డ్ కప్ ఫైనల్లో యువీ కంటే ముందు: ఇన్నాళ్లకు చెప్పిన ధోని

MS Dhoni Reveals Why He Came To Bat Before Yuvraj Singh In ICC World Cup 2011 | Oneindia Telugu
MS Dhoni Reveals Why He Came Out To Bat Before Yuvraj Singh In ICC World Cup 2011 Final vs Sri Lanka

హైదరాబాద్: భారత్‌కి 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే ప్రపంచకప్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన ఏకైక కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.. 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో యువరాజ్‌ సింగ్‌ కంటే ముందు మహేంద్రసింగ్‌ ధోని బ్యాటింగ్‌కు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మహిళల వరల్డ్ టీ20 సెమీపైనల్: ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమిమహిళల వరల్డ్ టీ20 సెమీపైనల్: ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి

ఆ టోర్నీలో చక్కటి ఫామ్‌ కనబరిచిన యువరాజ్‌ను ఆపి, ధోని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు రావడం ఆశ్చర్యం కలిగించింది. వాంఖడే వేదికగా ఏప్రిల్ 2న శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ (97), మహేంద్రసింగ్ ధోని (91) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 274 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి

274 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి

ఈ మ్యాచ్‌లో 274 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు 21.4 ఓవర్ల వద్ద విరాట్ కోహ్లి (35) రూపంలో మూడో వికెట్ గా ఔటయ్యాడు. దీంతో ఈ టోర్నీలో ఫామ్‌లో ఉన్న యువరాజ్ సింగ్ బ్యాటింగ్‌కి వస్తాడని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా యువీ స్థానంలో ధోని బ్యాటింగ్‌కి వచ్చాడు.

తొలిసారిగా పెదవి విప్పిన ధోని

తొలిసారిగా పెదవి విప్పిన ధోని

ఇందుకు కారణం అప్పట్లో మురళీధరన్ ఒక ఎండ్‌లో బౌలింగ్ చేస్తుండమే అని వార్తలు వచ్చాయి. ధోని జీవిత చరిత్ర ఆధారంగా తీసిన "ఎంఎస్ ధోని అన్‌టోల్డ్ స్టోరీ" సినిమాలోనూ ఇలానే చూపించారు. అయితే, ఆ రోజు తాను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్న దానిపై ధోని తొలిసారిగా పెదవి విప్పాడు.

 మురళీధరన్‌తో సాహా అప్పుడు ఐపీఎల్‌లో చెన్నైకి

మురళీధరన్‌తో సాహా అప్పుడు ఐపీఎల్‌లో చెన్నైకి

"శ్రీలంక జట్టులోని చాలా మంది బౌలర్లు.. మురళీధరన్‌తో సాహా అప్పుడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కి ఆడారు. వికెట్‌ పడ్డ సమయానికి మురళీధరన్‌ బౌలింగ్‌ చేస్తుండటంతో నేను ముందు వెళ్లాలనుకున్నా. నెట్స్‌లో వారి బౌలింగ్‌ని చాలాసార్లు ఎదుర్కొన్నాను. అందుకే నేనైతే మురళీ ధరన్ బౌలింగ్‌లో స్వేచ్ఛగా పరుగులు రాబట్టగలనని అనిపించింది"

పరుగులు చేయగలనన్న ధీమాతోనే

పరుగులు చేయగలనన్న ధీమాతోనే

"అతడి బౌలింగ్‌లో పరుగులు చేయగలనన్న ధీమాతోనే బ్యాటింగ్‌కు సిద్ధమయ్యాను. ఈ ఆలోచనలో భాగంగానే యువరాజ్ సింగ్‌ని వెనక్కి పంపించి నేను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకి వెళ్లా" అని ధోని చెప్పాడు. ధోని వ్యూహం ఫలించింది. ధోని మెరుపు ఇన్నింగ్స్‌ (71 బంతుల్లో 91 నాటౌట్‌)తో జట్టుకు ప్రపంచకప్‌ అందించడం ద్వారా తనపై విమర్శలు రాకుండా చూసుకున్నాడు.

Story first published: Friday, November 23, 2018, 9:46 [IST]
Other articles published on Nov 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X