న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్ తర్వాత ధోని రిటైర్మెంట్? చీఫ్ సెలక్టర్ ఎమన్నాడో తెలుసా?

MS Dhoni Was Most Gracious Says MSK Prasad | Oneindia Telugu
MS Dhoni to retire after World Cup 2019? Chief selector MSK Prasad has his say

హైదరాబాద్: ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే. గతేడాది పేలవ ఫామ్‌తో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయిన ధోనీ.. ఈ ఏడాది ఆరంభంలోనే ఆస్ట్రేలియాపై మూడు వన్డేల సిరీస్‌లో 'హ్యాట్రిక్' హాఫ్ సెంచరీలు బాది ఫామ్‌లోకి రావడంపై అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

జీవితకాల నిషేధం విధించాలి: మాజీ క్రికెటర్‌పై హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్ చైన్లతో దాడిజీవితకాల నిషేధం విధించాలి: మాజీ క్రికెటర్‌పై హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్ చైన్లతో దాడి

టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని

టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని

ఇప్పటికే, ధోని టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ధోని వీడ్కోలుపై అతడితో చర్చించలేదని టీమిండియా ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. తాజాగా క్రిక్‌ఇన్ఫోకి ఇచ్చిన ఇంటర్యూలో ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ ధోనీ మళ్లీ ఫామ్ అందుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు.

రిటైర్మెంట్ గురించి చర్చించలేదు

రిటైర్మెంట్ గురించి చర్చించలేదు

"ధోనితో రిటైర్మెంట్ గురించి చర్చించలేదు. ఎందుకంటే వరల్డ్‌కప్ లాంటి పెద్ద టోర్నీకి ముందు దీనిపై మాట్లాడటం సరైంది కాదు. ప్రస్తుతం అందరి దృష్టి వరల్డ్‌కప్ పైనే ఉంది" అని ఎమ్మెస్కే అన్నాడు. ఇక, ధోని ఫామ్ గురించి మాట్లాడుతూ "ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనలో అత్యుత్తమంగా ఆడటం ద్వారా ధోని అందరికీ స్పష్టమైన సందేశం పంపాడు" అని చెప్పుకొచ్చాడు.

ఇదే ఫామ్‌ని వరల్డ్‌కప్‌ వరకూ

ఇదే ఫామ్‌ని వరల్డ్‌కప్‌ వరకూ

'అదేంటంటే? తను ఇకపై మునుపటిలా సహజ సిద్ధంగా హిట్టింగ్ చేస్తానని.. వాస్తవానికి మనకు తెలిసిన ధోని ఆట ఇదే. గతంలో ప్రత్యర్థులపై అతను విరుచుకుపడిన తీరుని మరోసారి మనకి గుర్తు చేశాడు. వరల్డ్‌కప్‌కి ముందు ధోని ఐపీఎల్ 2019 సీజన్‌లో దాదాపు 14-16 మ్యాచ్‌లు ఆడతాడు. ఇదే ఫామ్‌ని వరల్డ్‌కప్‌ వరకూ కొనసాగించే అవకాశం ఉంది. ధోనీ ఇలా మళ్లీ మునుపటి‌లా హిట్టింగ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. వరల్డ్‌కప్‌లో ధోనినే టీమిండియాలో కీలక ఆటగాడు" అని ఎమ్మెస్కే పేర్కొన్నాడు.

Story first published: Tuesday, February 12, 2019, 15:37 [IST]
Other articles published on Feb 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X