ఆర్మీ దుస్తుల్లోనే కవాతు చేస్తూ: ట్విట్టర్‌లో ధోనిపై ప్రశంసలు

Posted By:
MS Dhoni Receives Padma Bhushan Award From President Ram Nath Kovind, Twitter Loves It

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతులమీదుగా పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ధోని ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నాడు.

ఈ కార్యక్రమానికి ధోని కుటుంబ సమేతంగా హాజరయ్యారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా కలిగిన ధోని ఆర్మీ దుస్తుల్లోనే కవాతు చేస్తూ రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి మరీ అవార్డు స్వీకరించాడు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత ధోనీకి ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా దక్కిన సంగతి తెలిసిందే.

ఇక ధోని అవార్డు అందుకుంటుండగా అతని భార్య సాక్షిసింగ్‌ నవ్వుతూ సంతోషం వ్యక్తం చేశారు. ధోని జీవితంలో ఈ రోజు(ఏప్రిల్ 2)కు ఎంతో ప్రత్యేకత ఉంది. సరిగ్గా ఏడేళ్ల కిందట ఇదే రోజున టీమిండియాకు ధోని వరల్డ్‌కప్ అందించాడు. మళ్లీ అదే రోజున భారత మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌ స్వీకరించాడు.

ధోనితో పాటు బిలియర్డ్స్‌లో 18సార్లు వరల్డ్ చాంపియన్ అయిన పంకజ్ అద్వానీకి కూడా పద్మభూషణ్ స్వీకరించాడు. పద్మభూషణ్ అవార్డు అందుకున్న 11వ భారత క్రికెట్ మహేంద్ర సింగ్ ధోని. 2013లో మొట్టమొదటిసారి ఈ అవార్డుని రాహుల్ ద్రవిడ్ అందుకున్నాడు. ఈ సందర్భంగా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా ధోనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మహమ్మద్‌ కైఫ్‌

పద్మభూషణ్‌ అందుకున్న లెఫ్టినెంట్‌ కల్నల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి అభినందనలు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున మనం ప్రపంచకప్‌ గెలిచాం

ఢిల్లీ డేర్ డెవిల్స్

ఢిల్లీ డేర్ డెవిల్స్

ఏప్రిల్‌ 2, 2011: మహేంద్ర సింగ్‌ ధోనీ భారత్‌ వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
ఏప్రిల్‌ 2, 2018: ధోనీ పద్మభూషణ్‌ అందుకున్నాడు. కంగ్రాట్స్‌ ధోనీ. ఎల్లప్పుడు నువ్వు మాకు ఆదర్శంగా నిలుస్తావు

చెన్నై సూపర్‌ కింగ్స్‌

పద్మభూషణ్‌ మహేంద్ర సింగ్‌ ధోని. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారిస్తోన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల విరామం తర్వాత చెన్నై జట్టు తిరిగి ఐపీఎల్‌లోకి అడుగుపెడుతోంది.

గోపీచంద్‌ మలినేని

లీడర్‌కు సరైన అర్థం. ధోనిని చూసి దేశం గర్విస్తోంది

కేంద్రమంత్రి హర్షవర్థన్‌

వరల్డ్ కప్ గెలిచిన ఏప్రిల్‌ రెండో 2వ తేదీనే ధోనీ పద్మభూషణ్‌ అందుకున్నాడు. రెండూ భలే కలిసి వచ్చాయి. నిన్ను చూసి భారత్‌ ఎంతో గర్విస్తుంది.

రవిచంద్రన్‌ అశ్విన్‌

పద్మభూషణ్‌ అందుకున్న ధోనికి అభినందనలు. వరల్డ్ కప్ సాధించిన ఆ తేదీనే నీకు ఈ పురస్కారం దక్కింది. నీ కోసం మరిన్ని పురస్కారాలు ఎదురుచూస్తున్నాయని నేను నమ్ముతున్నాను.

రాహుల్‌ శర్మ

పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్న ధోనికి అభినందనలు

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 3, 2018, 12:28 [IST]
Other articles published on Apr 3, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి