న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

25 శాతం వాటాదారుడిగా 'రన్ ఆడం'తో చేతులు కలిపిన ధోనీ

MS Dhoni picks up 25% stake in athlete management startup Run Adam

హైదరాబాద్: చెన్నైకు చెందిన ప్రముఖ సంస్థతో ధోనీ 25శాతం వాటాదారుడిగా చేతులు కలిపాడు. దేశంలోని తొలి 360 డిగ్రీల పర్యావరణ సహిత క్రీడా సాంకేతిక సంస్థగా నిలిచిన రన్‌ ఆడంకు భారత స్టార్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. అంతేకాదు, ఈ కంపెనీలో ఇప్పటికే 25 శాతం వాటా కూడా తీసుకున్నారు. ధోనీ ముందుండి నడిపిస్తే తమ సంస్థ మరింత వృద్ధి చెందుతుందని యాజమాన్యం వెల్లడించింది.

క్రీడారంగంలోకి వెళ్లాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ

క్రీడారంగంలోకి వెళ్లాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ

దీనిలో వాటాదారుడు కాకముందే గతేడాది డిసెంబరులోనే ధోనీ ఈ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించారు. క్రీడాకారులకు రన్ ఆడమ్ అనేది ఒక మంచి ప్లాట్‌ఫాం‌మ్‌గా రూపుదిద్దుకుంది. ఈ సంస్థ ద్వారా రూపొందించబడ్డ మొబైల్ యాప్‌లో లాగిన్ అయి దేశ వ్యాప్తంగా ఉన్న క్రీడారంగం వారితో అనుసంధానమయ్యేందుకు సులువుగా ఉంటుంది. సదరు సంస్థ ద్వారా క్రీడాకారుల వివరాలు, పెట్టుబడి దారులు, కోచ్‌లు ఇలా క్రీడారంగంలోకి వెళ్లాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపయోగకరంగా ఉంటుంది.

ఇప్పటికే 10వేల మంది క్రీడాకారులు

ఇప్పటికే 10వేల మంది క్రీడాకారులు

ఇప్పటికే 10వేల మంది క్రీడాకారులు తమ పేర్లను రిజిష్టర్ చేసుకున్నారు. ఈ యాప్‌లో రిజష్టర్ చేసుకోవడం కూడా ఉచితంగానే చేసుకోవచ్చు. గూగూల్ ప్లే ద్వారా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ, స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు రన్‌ ఆడం సంస్థ కృషి చేస్తుంది. ఇందుకోసం స్పాన్సర్లు, క్రీడా వనరులను క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువస్తుంది.

కేవై సెల్వన్‌ సమక్షంలో ధోనీని

కేవై సెల్వన్‌ సమక్షంలో ధోనీని

రన్‌ ఆడంకు ప్రచారకర్తగా నియమితులైన ధోనీ మంగళవారం చెన్నై వచ్చారు. సంస్థ ఎండీ, సిఈఓ కేవై సెల్వన్‌ సమక్షంలో ధోనీని ప్రచారకర్తగా ప్రకటించారు. స్థానిక క్రీడాకారుల కలలను నెరవేర్చేందుకు రన్‌ ఆడం ఒక వారధిగా నిలుస్తుందని, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ సందర్భంగా ధోనీ పిలుపునిచ్చారు.

ధోనీతో పాటుగా మరో ఐదుగురిని ప్రచారకర్తలుగా

ధోనీతో పాటుగా మరో ఐదుగురిని ప్రచారకర్తలుగా

దీనికి ధోనీతో పాటుగా మరో ఐదుగురిని ప్రచారకర్తలుగా నియమించుకుంది యాజమాన్యం. ఐదు సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్‌ను ఇదే ఏడాది మార్చిలో అంబాసిడర్‌గా కొనుగోలు చేసింది. అంకుర పరిశ్రమలపై పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపే ధోనీ.. ఇటీవలి కాలంలో.. ముంబైకు చెందిన ఎలక్ట్రానిక్స్ విభాగంలోని సౌండ్ లాజిక్ సంస్థకు భాగస్వామిగా ఒప్పందం కుదుర్చుకున్నాడు.

Story first published: Thursday, August 9, 2018, 15:48 [IST]
Other articles published on Aug 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X