న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా నిక్ నేమ్స్‌లో ‘తలా’ వెరీ స్పెషల్‌: ధోని ఎమోషనల్ (వీడియో)

IPL 2019 : MS Dhoni Reacts To Being Called ‘Thala’ And Speaks About CSK Fans ! || Oneindia Telugu
MS Dhoni pays tribute to CSK fans: Thala is a big nickname they have given me

హైదరాబాద్: మహి, కెప్టెన్ కూల్, ఎమ్ఎస్‌డి ఇలా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అనేక ముద్దు పేర్లు ఉన్నాయి. అయితే, 'తలా' అనే ముద్దు పేరు మాత్రం ఐపీఎల్ జరిగే ఆ రెండు నెలలు తెగ పాపులర్ అవుతుంది. తలా అంటే తమిళంలో లీడర్ అని అర్ధం. ఐపీఎల్‌లో జరిగే ఆ రెండు నెలలు ధోనీని సీఎస్‌కే అభిమానులు ముద్దుగా తలా అని పిలుచుకుంటారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఐపీఎల్ టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో చెన్నై మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో 22 బంతుల్లో 44(4 ఫోర్లు, 3 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ధోనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

సీఎస్‌కే ప్యాన్స్‌పై ధోని ఎమోషనల్

మ్యాచ్ అనంతరం ధోని సీఎస్‌కే అభిమానుల గురించి కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. తలా ముద్దు పేరు గురించి ధోని మాట్లాడుతూ "తలా నాకు వేరీ స్పెషల్‌ నిక్‌ నేమ్‌. తమిళనాడులో ఎక్కడికి వెళ్లినా నన్ను ధోని అని కాకుండా 'తలా' అని పిలుస్తారు. సీఎస్‌కే ఫ్యాన్స్‌ నన్ను ఆ ముద్దు పేరుతో పిలవడం నా అదృష్టం" అని ధోని చెప్పుకొచ్చాడు.

నా నిక్ నేమ్స్‌లో ‘తలా' వెరీ స్పెషల్‌

నా నిక్ నేమ్స్‌లో ‘తలా' వెరీ స్పెషల్‌

"నా నిక్ నేమ్స్‌లో ‘తలా' వెరీ స్పెషల్‌. సీఎస్‌కే అభిమానులు ప్రతిసారి నాకు, మా జట్టుకు ఎంతో మద్దతుగా నిలిచారు. వారినిని ఎప్పటికి మరిచిపోను" అని ధోని వెల్లడించాడు. కాగా, ఢిల్లీతో మ్యాచ్ అనంతరం ఆఖర్లో మైదానంలో ఉన్న అభిమానులకు ధోని స్వయంగా టీషర్టులను పంచిపెట్టాడు.

ఆటోగ్రాఫ్‌ చేసిన బంతుల్ని

ఆటోగ్రాఫ్‌ చేసిన బంతుల్ని

దీంతో పాటు తాను ఆటోగ్రాఫ్‌ చేసిన బంతుల్ని ధోనీనే స్వయంగా బ్యాడ్మింటన్‌ బ్యాట్‌తో ప్రేక్షకుల్లోకి కొట్టడం విశేషం. ఈస సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సీఎస్‌కే పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచింది. ఈ సీజన్‌లో తన చివరి లీగ్ మ్యాచ్‌ని చెన్నై... కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆడనుంది.

80 పరుగుల తేడాతో చెన్నై విజయం

80 పరుగుల తేడాతో చెన్నై విజయం

ఈ మ్యాచ్‌లో 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 16.2 ఓవర్లలో 99 పరుగులు చేసి ఆలౌటైంది. అంతకముందు సురేశ్ రైనా 37 బంతుల్లో 59(8 ఫోర్లు, సిక్స్), ధోని 22 బంతుల్లో 44(4 ఫోర్లు, 3 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది.

Story first published: Thursday, May 2, 2019, 15:46 [IST]
Other articles published on May 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X