న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అశ్విన్‌పై నమ్మకం లేదా?: ధోనీపై అనుమానం, కారణాలివే..

By Srinivas

న్యూఢిల్లీ: పుణే సూపర్ జెయింట్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొన్ని ఐపీఎల్ మ్యాచులలో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌కు పూర్తి కోటా ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వడం లేదు. దీంతో, అశ్విన్ - ధోనీ మధ్య ఏవైనా విభేదాలు వచ్చాయా లేదా అశ్విన్ పైన ధోనీకి విశ్వాసం లేదా అనే చర్చ సాగుతోంది.

దీనిపై మాజీ పేసర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. అశ్విన్ పైన ధోనీ నమ్మకం కోల్పోలేదని, మ్యాచ్ పరిస్థితులే కారణమని చెప్పాడు. ముంబై వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో పుణే ఆడిందని, వాంఖేడే పిచ్ సీమర్లకు అనుకూలిస్తుందని, అందుకే ఈ మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదన్నాడు.

చెన్నైలో ఐపీఎల్ మ్యాచులు ఆడినప్పుడు అక్కడి వికెట్ స్పిన్‌కు సహకరిస్తుందని, కాబట్టి అశ్విన్‌కు ఎక్కువ అవకాశమిచ్చాడని చెప్పాడు. ఇతర వేదికల్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని అజిత్ అగార్కర్ చెప్పాడు. ధోనీకి అశ్విన్ పైన నమ్మకం లేకపోవడం కాదన్నాడు.

MS Dhoni not lacking in faith on Ashwin: Ajit Agarkar

ఇందుకే అనుమానాలు..

రెండు రోజుల క్రితం బెంగళూరుతో మ్యాచ్ సమయంలో దిండా, ఆర్పీ సింగ్‌లతో బౌలింగ్‌ ఆరంభించాడు ధోని. తర్వాత పెరీరాను తెచ్చాడు. ఆపై భారత పిచ్‌లపై ఏమాత్రం అనుభవం లేని ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాను దించాడు. చివరికి మీడియం పేసర్‌ రజత్‌ భాటియాకు కూడా బౌలింగ్‌ ఇచ్చాడు.

అశ్విన్‌కు మాత్రం బంతే ఇవ్వలేదు. చివరికి 14, 15 ఓవర్లలో పెరీరా, భాటియా కలిసి 39 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో, మ్యాచ్‌ బెంగళూరు వైపు మొగ్గింది. అప్పుడు బంతిని అశ్విన్ చేతికి ఇచ్చాడు. పదహారో ఓవర్లో కానీ అశ్విన్ తన తొలి ఓవర్‌ వేయలేకపోయాడు.

ఆ ఓవర్లో అశ్విన్ అతను ఏడు పరుగులే ఇచ్చాడు.. కానీ ఆ తర్వాత మళ్లీ అతడికి ఓవర్‌ ఇవ్వలేదు. అప్పట్లో నేరుగా కొత్త బంతిని అశ్విన్‌కు ఇచ్చేవాడు ధోనీ. అశ్విన్‌ ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్‌ చేయగలడని కితాబిచ్చాడు కూడా.

అయితే, అప్పుడు అశ్విన్ పైన అంత విశ్వాసం ఉంచిన ధోనీ.. ఇప్పుడు ఎందుకు అలా వ్యవహరిస్తున్నాడనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ఐపీఎల్‌ ఆరంభం నుంచి అశ్విన్.. చాలా మ్యాచ్‌ల్లో మధ్య ఓవర్లలో, ఆలస్యంగా బౌలింగ్‌కు వచ్చాడు. కొన్నిసార్లు కోటా పూర్తి చేయలేదు.

మురుగన్ అశ్విన్‌లో ఆత్మవిశ్వాసం నింపేందుకు అని ధోనీ తొలుత చెప్పాడు. కానీ ఇన్ని మ్యాచులు అయ్యాక కూడా అశ్విన్‌కు సరిగా బౌలింగ్ ఇవ్వడం లేదు.

బెంగళూరుతో మ్యాచ్‌లో అశ్విన్‌కు ఆలస్యంగా బంతినివ్వడానికి కారణం.. క్రీజులో కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ ఉండటమేనని అంటున్నారు. ఆ వాదన సరైంది కాదని అంటున్నారు. ప్రపంచస్థాయి బౌలర్ కుడిచేతి వాటం బ్యాట్సుమెన్ ఉండగా బౌలింగ్‌కు పనికిరాడా, కుడి చేతి వాటం బ్యాట్సుమెన్ ఎక్కువ ఉంటారని గుర్తు చేస్తున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X