న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిసిన ధోనీ.. ఎందుకో తెలుసా!!

MS Dhoni meets President Ram Nath Kovind at Rajbhawan in Ranchi

రాంచీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ కలిశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా జార్ఖండ్‌ రాష్ట్ర రాజధాని రాంచీ చేరుకున్న కోవింద్‌ను ధోనీ కలుసుకున్నారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆదివారం గుమ్లా జిల్లాలో పర్యటించాల్సి ఉంది. ఆయితే అక్కడ ఎడతెరపి లేకుండా వర్షం పడటంతో రాష్ట్రపతి కోవింద్‌ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

వరుసగా 17వ సూపర్-10 సాధించిన నవీన్.. ప్లే ఆఫ్స్‌ నుంచి పుణే ఔట్‌!వరుసగా 17వ సూపర్-10 సాధించిన నవీన్.. ప్లే ఆఫ్స్‌ నుంచి పుణే ఔట్‌!

 ధోనీకి డిన్నర్:

ధోనీకి డిన్నర్:

రాంచీలోని రాజ్‌భవన్‌లో బస చేసిన రాష్ట్రపతి ఆదివారం రాత్రి విందుకు ఎంఎస్ ధోనీని ఆహ్వానించారు. దీంతో ధోనీ రాజ్‌భవన్‌కు వెళ్లి రాష్ట్రపతితో కలిసి ముచ్చటించారు. అనంతరం వీరిద్దరు కలిసి భోజనం చేశారు. ప్రపంచకప్‌ అనంతరం ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులు భారత ఆర్మీకి సేవలందించిన ధోనీ.. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు వెళ్లాడు. అక్కడ గోల్ఫ్‌ స్టిక్‌ పట్టుకొని సందడి చేసిన విషయం తెలిసిందే.

బిలియర్డ్స్‌ ఆడుతూ:

బిలియర్డ్స్‌ ఆడుతూ:

అమెరికా పర్యటన అనంతరం రాంచీ చేరుకున్న ధోనీ జార్ఖండ్‌ స్టేట్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ స్టేడియంలో బిలియర్డ్స్‌ ఆడుతూ కనిపించాడు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అంతకుముందు ధోనీ తన కింద్ జీపు గ్రాండ్ చెరోకీ ట్రక్కులో రాంచీ నగరంలో చక్కర్లు కొట్టాడు. ఈ ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

రిటైర్మెంట్‌పై పెద్ద ఎత్తున చర్చ:

రిటైర్మెంట్‌పై పెద్ద ఎత్తున చర్చ:

ప్రస్తుతం ధోనీ రిటైర్మెంట్‌ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది మాజీలు క్రికెట్‌కు వీడ్కోలు పలికే సమయం వచ్చిందని అంటున్నారు. మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఘాటుగానే స్పందించిన విషయం తెలిసిందే. ఎవరూ సాగనంపకముందే అతడే వెళ్ళిపోవాలి సూచించాడు. మరికొందరు మాత్రం ధోనీకి మద్దతుగా నిలుస్తున్నారు. మద్దతుగా నిలిచిన వాళ్లలో శిఖర్ ధావన్‌, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, హర్భజన్ లాంటి వారు ఉన్నారు.

రూమర్లకు పులిస్టాప్:

రూమర్లకు పులిస్టాప్:

ధోనీ రిటైర్మెంట్‌ ఇస్తున్నాడని ఇటీవల వార్తలు వచ్చినా.. అందులో ఎలాంటి నిజం లేదని ధోనీ సతీమణి సాక్షి వివరణ ఇచ్చారు. మరోవైపు చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కూడా ధోనీ రిటైర్మెంట్‌పై ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేసాడు. దీంతో ప్రస్తుతం ఈ రూమర్లకు పులిస్టాప్ పడింది. అయితే రిటైర్మెంట్‌పై ఎన్ని వార్తలు వచ్చినా ధోనీ మాత్రం స్పందించకపోవడం విశేషం.

Story first published: Monday, September 30, 2019, 11:02 [IST]
Other articles published on Sep 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X