న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అప్పుడు విరాట్ కోహ్లీ.. ఇప్పుడు ఎంఎస్ ధోనీ! అచ్చం జడేజా లానే!! (వీడియో)

MS Dhoni Makes Fun Of Ravindra Jadejas sword celebration during IPL 2021
IPL 2021 : Ravindra Jadeja నెంబర్ 1 All-rounder - Suresh Raina | Csk vs Srh || Oneindia Telugu

రాంచీ: టీమిండియా ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా కత్తిసాము గురించి తెలియని వారుండరు. రాజ వంశానికి చెందిన ఈ సౌరాష్ట్ర క్రికెటర్‌ హాఫ్‌ సెంచరీ, సెంచరీ చేసిన సందర్భాల్లో కానీ.. ఏమైనా అరుదైన ఘనతల్ని సాధించినప్పుడు కానీ బ్యాట్‌తో కత్తిసాము చేయడం పరిపాటి. దీన్ని ఒకానొక సందర్భంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ కూడా అనుకరించే యత్నం చేశాడు. 2019 ఐపీఎల్‌లో భాగంగా ఓ ప్రకటనలో నటించే క్రమంలో జడేజా తరహాలో బ్యాట్‌తో కత్తిసాము చేశాడు వార్నర్‌. కానీ అంతలా ఆకట్టుకోలేకపోయాడు.

ఇక భారత ఆటగాళ్లలో రవీంద్ర జడేజా బ్యాట్‌ సాముని కెప్టెన్ విరాట్ కోహ్లీ సరదాగా అనుకరించగా.. తాజాగా టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ కూడా ఆ అనుకరణ జాబితాలో చేరాడు. ఐపీఎల్ 2021 సీజన్ సమయంలో జడేజాని ధోనీ అనుకరించగా.. ఆలస్యంగా వీడియోని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ అభిమానులతో పంచుకుంది. అయితే మహీ బ్యాట్‌తో కాకుండా ఖాళీ చేతులతోనే కత్తిసాము చేశాడు. ఆ పక్కనే కూర్చున్న రాబిన్ ఉతప్ప మహీని చూసి నవ్వుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.

క్రికెట్‌ ఆడే సమయంలో తన ప్రాక్టీస్‌ సెషన్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పంచుకునే రవీంద్ర జడేజా ఖాళీ సమయాల్లోనూ ఏం చేస్తుంటాడో అభిమానులకు తెలియజేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ ఫొటోలు పెట్టి అందర్నీ ఆకట్టుకుంటాడు. తాజాగా తనకు ఎంతో ఇష్టమైన గుర్రం ఫొటోలను పంచుకున్న జడ్డూ అది తన 22 ఎకరాల ఎంటర్‌టైనర్‌ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. దానికి ఇంగ్లండ్ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ ఫిదా అయిపోయి హృదయ ఆకారంతో మూడు ఎమోజీలను కామెంట్‌ సెక్షన్‌లో పోస్టు చేశాడు.

జడేజా ఇటీవలే భారత టెస్టు జట్టుకు మళ్లీ ఎంపికయ్యాడు. వచ్చేనెల ఇంగ్లండ్‌లో న్యూజిలాండ్‌ జట్టుతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌తో పాటు ఆ తర్వాత ఇంగ్లిష్‌ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌కు ఎంపికయ్యాడు. గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన అతని చేతి వేలికి గాయమైన సంగతి తెలిసిందే.

దాంతో జడ్డూ కొద్ది నెలలు ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే స్వదేశంలోఇంగ్లండ్‌తో జరిగిన మూడు సిరీసుల్లోనూ ఆడలేకపోయాడు. అనంతరం కోలుకొని ఐపీఎల్‌ 14వ సీజన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా చెన్నై తరఫున ఆడి మంచి ప్రదర్శన చేశాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో 62 పరుగులు చేశాడు. హర్షల్‌ పటేల్ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో 5 సిక్సర్లు, ఒక బౌండరీతో మొత్తం 37 పరుగులు సాధించి ఔరా అనిపించాడు.

Story first published: Monday, May 17, 2021, 13:31 [IST]
Other articles published on May 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X