న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

JSCA స్టేడియంలో సందడి చేసిన ధోని, సోరెన్: ఆకులతో ఈలలు వేసే ప్రయత్నం!

MS Dhoni, Jharkhand CM inaugurate new facilities at JSCA Stadium, try to whistle with leaves

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌లు జార్కండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పలు కొత్త సౌకర్యాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ధోని, సోరెన్ ఉల్లిపాయ ఆకులను ఉపయోగించి ఈలలు వేసేందుకు ప్రయత్నించారు.

జార్ఖండ్ రాజధాని రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం కాంప్లెక్స్‌లో సౌర విద్యుత్ వ్యవస్థ, అత్యాధునిక జిమ్, సి3 ఫిట్‌నెస్ క్లబ్, ది అప్‌టౌన్ కేఫ్‌ను ధోని, హేమంత్ సోరెన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిద్దరూ కొన్ని వంటలను రుచి చూడటంతో పాటు కొత్త రెస్టారెంట్‌లో కాఫీ కూడా తాగారు.

ICC Women's World Cup 2021: ఫైనల్ మ్యాచ్‌కి ఆతిథ్యమిచ్చే నగరమిదే!ICC Women's World Cup 2021: ఫైనల్ మ్యాచ్‌కి ఆతిథ్యమిచ్చే నగరమిదే!

ఇటీవలే జార్ఖండ్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన హేమంత్ సోరెన్‌ను ధోని అభినందించాడు. ధోని మాట్లాడుతూ "ఆయన నాయకత్వంలో మన రాష్ట్ర వైభవం దేశంలోనే కాదు, ప్రపంచమంతటా వ్యాపిస్తుందని నేను ఆశిస్తున్నాను. సరిగ్గా ప్రాక్టీస్ చేయమని ఆటగాళ్లకు చెప్పాలనుకుంటున్నా. రంజీల్లో బాగా ఆడండి తద్వారా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు" అని అన్నాడు.

అనంతరం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడుతూ "ముఖ్యమంత్రిగా స్టేడియంలో సౌకర్యాలను ప్రారంభించే అవకాశం లభించినందుకు ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను. ఈ స్టేడియంకు పునాది వేసింది గురుజీ (తండ్రి శిబు సోరెన్). ఈ స్టేడియం గురూజీ ప్రారంభించిన పని ఫలితానికి ఒక ఉదాహరణ. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను" అని చెప్పాడు.

కాగా, ప్రపంచకప్ అనంతరం ధోనీ క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. తొలుత భారత సైన్యంలో సేవ చేసేందుకు రెండు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. ఆపై కూడా జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. రెండు నెలల విశ్రాంతి కాస్త ఆరు నెలలు దాటింది. దీంతో మహీ రిటైర్మెంట్‌పై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయినా ధోనీ మాత్రం తన రిటైర్మెంట్‌పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

న్యూజిలాండ్ ప్రపంచకప్ ఫైనల్‌ చేరితే మేం సంతోషించాం : కోహ్లీన్యూజిలాండ్ ప్రపంచకప్ ఫైనల్‌ చేరితే మేం సంతోషించాం : కోహ్లీ

తాజాగా బీసీసీఐ 2019 అక్టోబర్‌ నుంచి 2020 సెప్టెంబర్‌ వరకూ ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్‌ జాబితాను ప్రకటించగా అందులోనూ ధోనికి చోటు లభించలేదు. అయితే, బీసీసీఐ తనను కాంట్రాక్ట్‌ జాబాతా నుంచి తప్పించిన రోజే ధోనీ ఝార్ఖండ్‌ రంజీ జట్టుతో కలిసి మైదానంలో ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. రంజీ జట్టుతో కలిసిన ధోనీ వైట్‌బాల్‌తో ఎక్కువగా ప్రాక్టీస్‌ చేశాడు.

'విదేశాల్లో టీమిండియా మరిన్ని టెస్టు విజయాలు సాధిస్తుంది''విదేశాల్లో టీమిండియా మరిన్ని టెస్టు విజయాలు సాధిస్తుంది'

దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)-2020కి సన్నద్ధం అవుతున్న విషయాన్ని ధోని చెప్పకనే చెప్పేశాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది.

Story first published: Thursday, January 23, 2020, 15:46 [IST]
Other articles published on Jan 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X