న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ప్రపంచకప్‌ నాలుగో స్థానంలో ధోనీనే సరైనవాడు'

MS Dhoni is perfct in No. 4 for India says Krishnamachari Srikanth

వచ్చే ప్రపంచకప్‌లో నాలుగో స్థానానికి ధోనీనే సరైనవాడు, అతను తప్ప ఆ స్థానానికి మరెవరూ న్యాయం చేయలేరని భారత మాజీ క్రికెటర్‌ కృష్ణమాచార్య శ్రీకాంత్‌ అన్నారు. మే 30 నుండి ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. టీమిండియా నాలుగో స్థానం గురించి ఎప్పటినుంచో జరుగుతున్న చర్చలకు తాజాగా సెలెక్టర్లు తెరదించారు.

విజయ్‌ శంకర్‌కు అవకాశం:

విజయ్‌ శంకర్‌కు అవకాశం:

నాలుగో స్థానంలో సీనియర్ అంబటి రాయుడును కాదని యువ ఆటగాడు ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎంపికపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా తెలుపుతున్నారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్‌ కృష్ణమాచార్య శ్రీకాంత్‌ కూడా తన అభిప్రాయాన్ని తెలిపాడు.

ఛేదనలో ధోనీ బ్యాటింగ్ ఉపయోగం:

ఛేదనలో ధోనీ బ్యాటింగ్ ఉపయోగం:

'ధోనీలో ఇంకా చాలా క్రికెట్ ఉంది. వన్డేలలో అతనికున్న విజన్ మరే ఆటగాడికి ఉండదు. అతను ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే ఎటువంటి బౌలర్ కు అయినా కష్టమే. ధోనీ బ్యాటింగ్‌ స్ట్రైక్‌రేట్‌ ఈ మధ్య కొంచెం తగ్గి ఉండొచ్చు. ఛేదనలో ధోనీ బ్యాటింగ్ జట్టుకు ఎంతో ఉపయోగపడుతోంది. ధోనీ వికెట్‌ కీపింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా అది మరోసారి రుజువయింది' అని శ్రీకాంత్‌ పేర్కొన్నారు.

సచిన్‌

సచిన్‌

'మా కాలంలో కపిల్‌ దేవ్‌, సచిన్‌లతో కలిసి ఆడాను. అయితే తన ఆటతో తోటి ఆటగాళ్లకు స్ఫూర్తి నింపగల క్రికెటర్లు కొంతమందే ఉంటారు. అందులో ధోనీ కూడా ఉంటాడు. ప్రస్తుతం ధోనీ అద్భుతంగా ఆడుతున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ను కూడా విజయవంతంగా నడిపిస్తున్నాడు. ప్రపంచకప్‌లో నాలుగో స్థానం గురించి చాలా చర్చలు జరిగాయి. ఆ స్థానంలో ఆడేందుకు ఇప్పటికే టీమిండియాకు ధోనీ ఉన్నాడు. నాలుగో స్థానంలో ధోనీకంటే బాగా మరెవరూ ఆడలేరని' శ్రీకాంత్‌ చెప్పుకొచ్చారు.

Story first published: Saturday, May 4, 2019, 19:37 [IST]
Other articles published on May 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X