న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనీకి ఎంతో క్రికెట్‌ భవిష్యత్తు ఉంది.. రిటైర్మెంట్‌పై అతడే ఓ నిర్ణయానికి రావాలి'

MS Dhoni has a lot of cricket left, retirement completely his call says Rajiv Shukla

ఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌-2019 సెమీస్ అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానానికి దూరమైన విషయం తెలిసిందే. తొలుత భారత సైన్యంలో సేవ చేసేందుకు రెండు నెలలు విశ్రాంతి తీసుకున్న జార్ఖండ్ డైనమైట్.. ఆ తర్వాత జనవరి వరకు క్రికెట్ సంబంధించిన ప్రశ్నలు అడగవద్దని సూచించారు. జనవరి ముగిసి ఫిబ్రవరి మధ్యకు వచ్చినా నోరు విప్పకపోవడం, ఇక బీసీసీఐ కాంట్రాక్టుల నుంచి తొలగించడంతో మహీ రిటైర్మెంట్‌పై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ధోనీ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా త‌న‌కు ల‌భించిన విరామాన్ని కుటుంబంతో ఆస్వాదిస్తున్నారు.

థాయ్‌పై అద్భుత విజయం.. సెమీస్‌లో భారత్‌.. పతకం ఖాయం!!థాయ్‌పై అద్భుత విజయం.. సెమీస్‌లో భారత్‌.. పతకం ఖాయం!!

ఎంతో క్రికెట్‌ భవిష్యత్తు ఉంది:

ఎంతో క్రికెట్‌ భవిష్యత్తు ఉంది:

తాజాగా ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా స్పందించారు. ధోనీకి ఎంతో క్రికెట్‌ భవిష్యత్తు ఉందని, అయితే రిటైర్మెంట్‌పై మహీనే ఓ నిర్ణయానికి రావాలన్నారు. 'ధోనీ టీమిండియాకు ఎంతో సేవ చేసాడు. అతడు అద్భుతమైన ఆటగాడు. మహీకి ఎంతో క్రికెట్‌ భవిష్యత్తు ఉంది. కానీ.. ఎప్పుడు రిటైర్మెంట్‌ తీసుకోవాలో అతడే నిర్ణయించుకోవాలి. బీసీసీఐ విధానాల ప్రకారం రిటైర్మెంట్‌పై ఆటగాళ్లే నిర్ణయాలు తీసుకోవాలి' అని రాజీవ్‌ అన్నారు.

సరైన షెడ్యూల్ అవసరం:

సరైన షెడ్యూల్ అవసరం:

క్రికెటర్ల పనిభారం గురించి కూడా రాజీవ్‌ శుక్లా మాట్లాడారు. రెండు అంతర్జాతీయ సిరీస్‌లోని మ్యాచ్‌లకు సరైన షెడ్యూల్ చేయాలి. అప్పుడే ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవడానికి సమయం లభిస్తుంది. ఎక్కువ మ్యాచ్‌లతో ఆటగాళ్లపై పనిభారం పడకుండా చూసుకోవాలన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బుకీ సంజీవ్ చావ్లాను లండన్ నుంచి రప్పించడంపై మాట్లాడుతూ... 'పోలీసులు సంజీవ్ చావ్లాపై ఉన్న కేసును దర్యాప్తు చేస్తున్నారు. చట్టంచర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే 12 రోజుల పోలీసు కస్టడీ విధించింది' అని అన్నారు.

పులి ఫొటో:

పులి ఫొటో:

తాజాగా ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్‌ అభిమానుల్లో జోష్‌ను తీసుకొచ్చింది. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని కన్హా పులుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ధోనీ.. తనలోని ఫొటోగ్రాఫ్‌ కళను బయటకు తీశారు. కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లిన మహీ.. అక్కడ పులులను ఫొటోలు తీస్తూ ఆహ్లాదంగా గడిపారు. పార్క్‌లో ఉన్న పులిని ఒక ఫొటోలో బంధించి అభిమానులతో పంచుకున్నారు. ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. దానికి అభిమానుల నుంచి మహీకి విశేషణ స్పందన లభిస్తోంది.

రాహుల్ రాకతో సైడ్ ట్రాక్:

రాహుల్ రాకతో సైడ్ ట్రాక్:

టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కీపింగ్ గ్లౌవ్స్ అందుకోవడంతో ధోనీ భవితవ్యంపై జరిగిన చర్చ సైడ్ ట్రాక్ అయింది. ఆస్ట్రేలియా సిరీస్‌లో రిషబ్ పంత్ అనూహ్య గాయంతో కీపింగ్ గ్లౌవ్స్‌ను అందుకున్న రాహుల్.. బ్యాట్‌తో పాటు వికెట్ల వెనుకాల అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక ధోనీ టీమిండియాకు ఆడినా ఆడకపోయినా.. ఈ ఏడాడితో పాటు వచ్చే ఏడాది కూడా ఐపీఎల్‌ ఆడనున్నారు. ఈ విషయాన్ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ యజమాని ఎన్‌ శ్రీనివాసన్‌ ఇదివరకే స్పష్టం చేసారు.

Story first published: Saturday, February 15, 2020, 13:28 [IST]
Other articles published on Feb 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X