న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనీ టిప్స్‌ చాలాసార్లు పనిచేయలేదు'

IPL 2019 : MS Dhoni Goes Wrong With His Tips A Lot Of Times, Says Kuldeep Yadav !
MS Dhoni Goes Wrong Lot Of Times With His Tips says Kuldeep Yadav

మహేంద్ర సింగ్ ధోనీ భారత అత్యుత్తమ కెప్టెన్‌లలో ఒకరు. కేవలం కెప్టెన్‌ మాత్రమే కాదు.. గొప్ప ఫినిషర్, మేటి కీపర్‌ మరియు తెలివైన కెప్టెన్‌. కీపర్‌గా కెరీర్ ఆరంభించిన మహీ.. 2007లో టీ20 ప్రపంచకప్‌లో తన సారధ్య బాధ్యతలు ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. అనంతరం ద్రావిడ్ నుంచి పగ్గాలు అందుకుని వేగంగా వ్యూహాలు రచించడంలో నైపుణ్యం సాధించి టీమిండియాకు ఎన్నో విజయాలు అందించారు.

యువ ఆటగాళ్లకు టిప్స్‌:

యువ ఆటగాళ్లకు టిప్స్‌:

ధోనీ తన కూల్ కెప్టెన్సీతో విశ్లేషకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. డ్రెసింగ్ రూమ్, మైదానంలో యువ ఆటగాళ్లకు ఎన్నో టిప్స్‌ చేస్తుంటారు. బ్యాట్స్‌మెన్ కదలికలకు అనుగుణంగా బౌలర్ ఎలా బౌలింగ్ చేయాలో, ఫీల్డర్లను ఎక్కడ ఉంచాలో ధోనీకి బాగా తెలుసు. బ్యాట్స్‌మన్‌ను బట్టి అప్పటికప్పుడు ప్లాన్స్‌ మారుస్తుంటారు. ఇక మ్యాచ్ కీలకంగా ఉన్న సమయంలో బౌలర్లకు ధోనీ ఇచ్చే టిప్స్‌ ఎంతగానో ఉపయోగపడుతాయి. అయితే ధోనీ కూడా తప్పులు చేస్తారని, ఆయన సూచనలు చాలాసార్లు పనిచేయలేదని భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

ఆ సలహాలు చాలాసార్లు తప్పాయి:

ఆ సలహాలు చాలాసార్లు తప్పాయి:

ముంబైలో సోమవారం జరిగిన సియెట్‌ క్రికెట్‌ రేటింగ్‌ అవార్డ్స్‌ ఫంక్షన్‌లో కుల్దీప్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుల్దీప్‌ మాట్లాడుతూ ధోనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ధోనీ ఇచ్చిన సలహాలు కూడా చాలాసార్లు పనిచేయలేదు. అయినా ఆ విషయాన్ని ఆయనకు చెప్పలేదు' అని కుల్దీప్‌ సరదాగా వ్యాఖ్యానించాడు. 'ధోనీ ఎక్కువ మాట్లాడడు. మ్యాచ్‌లో అవసరమైన సందర్భంలో.. ఓవర్ల మధ్య విరామ సమయంలో తన అభిప్రాయాలను బౌలర్‌తో చెపుతారు' అని కుల్దీప్‌ పేర్కొన్నారు.

15 మ్యాచ్‌లలో 416 పరుగులు:

15 మ్యాచ్‌లలో 416 పరుగులు:

తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్-12లో కుల్దీప్ విఫలమయి కొన్ని మ్యాచ్‌లలో కూడా ఆడలేదు. భారీగా పరుగులు ఇవ్వడం, వికెట్లు తీయలేకపోవడంతో కలకత్తా ఆడిన చివరి మ్యాచ్‌లలో అతడికి చోటు దక్కలేదు. మరోవైపు ధోనీ మాత్రం చెన్నై తరపున అద్భుతంగా రాణించాడు. 15 మ్యాచ్‌లలో 416 పరుగులు చేసాడు. స్ట్రైక్ రేట్ 134.62, ఆవరేజ్ 83.2గా ఉంది. ఈ సీజన్ అత్యధిక స్కోర్ 84. కుల్దీప్, ధోనీలు ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.

Story first published: Tuesday, May 14, 2019, 13:24 [IST]
Other articles published on May 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X